Facilitation to Censor Board Member Allamsetti Haripriya: అల్లంశెట్టి హరిప్రియకు సన్మానం

Share the news
Facilitation to Censor Board Member Allamsetti Haripriya: అల్లంశెట్టి హరిప్రియకు సన్మానం

Facilitation to Censor Board Member Allamsetti Haripriya

సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులుగా(Censor Board Member) ఎంపికైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అల్లంశెట్టి హరిప్రియ, నరేష్ దంపతులను Repalle జనసేన(Janasena) పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ ఘనంగా సన్మానించారు.

బాపట్ల జిల్లా, రేపల్లె మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు అల్లంశెట్టి నరేష్ బాబు సతీమణి హరిప్రియ హైదరాబాద్ లో ప్రముఖ న్యూస్ చానల్ లో పనిచేస్తున్నారు. న్యూస్ ప్రజెంటేషన్ లో తనదైన శైలిలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, సమకాలీన రాజకీయ సామాజిక అంశాలను, ప్రభుత్వాల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేస్తూ సేవలు అందిస్తున్నారని తెలిపారు.

అల్లంశెట్టి హరిప్రియ నరేష్ కేంద్ర సినిమాటోగ్రఫీ కి సంబంధించి సెన్సార్ బోర్డు సభ్యులుగా ఎంపిక కావటం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణం అన్నారు. ఇలాంటి గౌరవప్రదమైన పదవులు రేపల్లె నియోజకవర్గం లో అనేక మంది సాధించాలని తద్వారా రేపల్లె కు సొంత గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

See also  Repalle Constancy: రేపల్లె లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం.. విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక!

జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి చేరుకునేవారిని అభినందించటం జరుగుతుందని అన్నారు.

-By Guduru Ramesh, Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top