
వైజాగ్ లో Allu Arjun
Allu Arjun receives a గ్రాండ్ వెల్కమ్: అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule)కోసం సినీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రైజ్’ మంచి విజయం అందుకోవడంతో ‘పుష్ప: ది రూల్’ ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
మూవీ టీం నెక్స్ట్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం అల్లు అర్జున్ నేడు వైజాగ్ కు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఇక అల్లు అర్జున్ వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్ట్ కి తరలివచ్చారు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఆయనపై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫ్యాన్స్ అంతా ర్యాలీగా రావడంతో వైజాగ్ రోడ్లన్నీ బన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా రేపటి నుంచి వైజాగ్ పోర్ట్ ఏరియాలో ‘పుష్ప 2’ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.
పుష్ప 2 (Pushpa 2) సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇక సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జపాన్ టోక్యోలో జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్లిన ‘పుష్ప’ హీరోయిన్ రష్మిక మందన్న ‘పుష్ప2’ ఒరిజినల్ వెర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే రోజు జపాన్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. సో ‘పుష్ప2’ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.
FULL VIEDO
— Allu Arjun Folks ™ 🪓 (@AlluArjunFolks) March 10, 2024
ICONSTAAR @alluarjun Grand Welcome By @AIAFA_vizag And Fans With Bike Rally ❤️🤩🦁#VizagGaddaAlluArjunAdda #Pushpa #Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/s2yexpG7X3