Gabbar Singh Movie Singer: ‘గబ్బర్ సింగ్’ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

Share the news
Gabbar Singh Movie Singer: ‘గబ్బర్ సింగ్’ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

Gabbar Singh Movie Singer వడ్డేపల్లి శ్రీనివాస్(Vaddepalli Srinivas) కన్నుమూత

“గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా” ఈ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది ఆరేళ్ళ పిల్లాడిని అడిగినా ఈ పాట గబ్బర్ సింగ్ సినిమాలోది అని చెప్తాడు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ పాట యూత్ ని ఎంతగా ఊపు ఊపెసిందో మనందరికీ తెలుసు. Gabbar Singh Movie Singer గా ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ పాట పాడిన సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు.

సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్‌లోని తన నివాసంలో గురువారం (ఫిబ్రవరి 29) ఉదయం ఆయన మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జానపద గాయకుడిగా వడ్డేపల్లి శ్రీనివాస్(Vaddepalli Srinivas) విశేష గుర్తింపు పొందారు. 2012లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా..’ పాటతో తెలుగు రాష్ట్రాల్లో వడ్డేపల్లి శ్రీనివాస్ బాగా పాపులర్ అయ్యారు.

See also  Tillu Square racing towards 100cr: బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్న టిల్లు .. ఇక అంట్లుంటది మనతోని!

పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయనను అభినందించారు. ఈ పాటకిగానూ ఫిల్మ్‌ఫేర్‌ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు కూడా అందుకున్నారు. “గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా” పాట సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వడ్డేపల్లి శ్రీనివాస్‌కు సినిమాల్లో పలు అవకాశాలు లభించాయి. అంతకుముందు సుమారు 100కి పైగా పాటలు పాడారు. ప్రైవేట్‌గా వందలాది ఫోక్ సాంగ్స్ పాడారు. వడ్డేపల్లి శ్రీనివాస్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, జానపద కళాకారులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

-By Pranav @ samacharnow.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top