
Guntur Kaaram Movie Review
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్, జయరాం, మీనాక్షి చౌదరి, మురళి శర్మ, జగపతిబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్ , రఘుబాబు, ఈశ్వరీ రావు, రాహుల్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన- దర్శకత్వం: త్రివిక్రమ్
మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ‘అతడు’ క్లాసిక్ అనిపించుకుంది. ‘ఖలేజా’లో మహేష్ కామెడీ టైమింగ్ సూపర్. దాదాపు 10 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తుండటంతో ‘గుంటూరు కారం’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు మాస్ అవతార్, డ్యాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. మరి, సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
Guntur Kaaram Movie మైనస్ లు
రెగ్యులర్ మాస్ సినిమా కాబట్టి పెద్ద కథేమి ఉంటుంది. డైరెక్ట్ గా సినిమా ఎలావుందో చూద్దాం..
‘గుంటూరు కారం’ ప్రచార చిత్రాలు చూసిన తర్వాత మహేష్ బాబు మాస్ అవతార్, అటువంటి మాసీ క్యారెక్టర్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్… ఎటువంటి సినిమా తీశారోననే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువైంది. థియేటర్లలో కూర్చున్న జనాలకు ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతో సేపు పట్టదు. మహేష్ మాస్ తప్ప, కథను పక్కను పెట్టినా (రెగ్యులర్ మాస్ సినిమా కాబట్టి ) తెర మీద కొత్త కథనం, సన్నివేశాలు కనిపించవు. ‘గుంటూరు కారం’లో అడుగడుగునా త్రివిక్రమ్ మార్క్ కనిపించడం లేదనే వెలితి ప్రేక్షకులకు కలుగుతుంది. గుంటూరు కారం కథనాల్లో కొత్తదనం లేదనేది పక్కన పెడితే… కథలో అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాల ఛాయలు కనిపించాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ పెన్లో సిరా అయిపోయిందేమా పెద్దగా కదల్లేదు, రాయలేదు. సంభాషణల్లో ఆయన శైలి మిస్ అయ్యింది.
Guntur Kaaram Movie పాజిటివ్ లు
ఇక పాజిటివ్ విషయాల కొస్తే ‘కుర్చీ మడత పెట్టి…’, ‘నక్కిలీసు గొలుసు’ పాటల్లో మహేష్ బాబు డ్యాన్సులు బాగా చేశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్త మహేష్ బాబును చూస్తారు. అంత మాసీ క్యారెక్టర్‌లోనూ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక శ్రీ లీల డ్యాన్స్ గురించి చెప్పేదేముంది ఎప్పటిలానే కుమ్మేసింది. మీనాక్షి చౌదరి పాత్ర పరిధి తక్కువ. ఉన్నంతలో ఓకే . రమ్యకృష్ణ నటన ప్రెస్ మీట్, క్లైమాక్స్ సీన్లను నిలబెట్టింది. ప్రకాష్ రాజ్ చక్కగా చేశారు. జయరామ్, రావు రమేష్, ఈశ్వరి రావు, మురళీ శర్మ, రఘుబాబు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు. జగపతి బాబును సరిగా వాడుకోలేదు. సునీల్ ఒక్క సన్నివేశానికి పరిమితం అయ్యారు. వెన్నెల కిశోర్ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తుంది. బాబ్జిగా అజయ్ కనిపించేది రెండు మూడు సీన్లు అయినప్పటికీ… కడుపుబ్బా నవ్విస్తారు. త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్ అజయ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఫైట్స్ ఓకే. ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి… మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సూపర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చుకు వెనగడుగు వేయలేదు.
మహేష్ బాబు ఎనర్జీ, ఆ మాస్ క్యారెక్టరైజేషన్ సూపర్! మిర్చిలో ఘాటు డ్యాన్సుల్లో చూపించారు. అయితే, త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది. ఒక్క సీనులోనూ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. కామెడీ అనుకున్నంత లేదు. హై ఇచ్చే మూమెంట్స్ అసలే లేవు.
పచ్చిగా చెప్పాలి అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు అభిమానుల కళ్ళల్లో గుంటూరు కారం కొట్టాడు.
చివరిగా.. Guntur Kaaram Movie సంక్రాంతి సినిమా కాబట్టి కలెక్షన్స్ కు డోకా ఉండదు. మొదటి రోజే 50 కోట్లకి పైగా వసూళ్లు రావచ్చంటున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి. పండగ తరువాత సినిమా నిలబడటం కష్టమే.