HanumaN First Review Out: హను-మాన్ మొదటి రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ?

HanumaN First Review Out: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma ) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ HanumaN . తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తన రివ్యూని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలో ఏమేం బాగున్నాయో వివరంగా చెబుతూ.. ‘హను-మాన్’కు 3.5 రేటింగ్‌ కూడా ఇచ్చారు.
Share the news
HanumaN First Review Out: హను-మాన్ మొదటి రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ?

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma ) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ HanumaN . తేజ సజ్జా(Teja Sajja) హీరోగా నటించిన ఈ magnum opus టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తన రివ్యూని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలో ఏమేం బాగున్నాయో వివరంగా చెబుతూ.. ‘హను-మాన్’కు 3.5 రేటింగ్‌ కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ బాలీవుడ్ క్రిటిక్ ఎవరనుకుంటున్నారా? తరణ్ ఆదర్శ్ (Taran Adarsh)..

HanumaN First Review by తరణ్ ఆదర్శ్ (Taran Adarsh)..

ఆయన మాటల్లో..
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు… హనుమాన్ ప్రతిష్టాత్మకమైనది మరియు ఉత్తేజకరమైనది – డ్రామా, భావోద్వేగాలు, VFX మరియు పురాణాలను నైపుణ్యంగా ప్యాక్ చేసాడు … గూస్‌బంప్ మూమెంట్స్ + అసాధారణ ముగింపుతో లోడ్ చేయబడింది..

See also  Salaar: Congrats my dear 'Deva', అభినందనలు తెలిపిన మెగాస్టార్

హనుమాన్ సినిమా లో ముఖ్యమైనవి.. తేజసజ్జ తన పాత్రను బాగా చేసాడు, వరలక్ష్మి శరత్‌కుమార్ ఒక గుర్తుండిపోయే పాత్రను చేసింది, వినయ్‌రాయ్ బెదిరింపులకు గురవుతున్నాడు మరియు , సముద్రఖని సూపర్ ఫామ్‌లో ఉన్నాడు, వెన్నెలకిషోర్ పాత్ర మరింత నిడివి ఉండాల్సింది.

VFX కీలక పాత్ర పోషించింది, అద్భుతంగా సాగుతుంది, కానీ అది ఎక్కడా కూడా కథను అధిగమించదు… అన్ని ప్రధాన పాత్రల డబ్బింగ్ సముచితంగా వుంది, రన్ సమయం కొంచెం తక్కువ అయితే ఇంకా బావుండేది. మొదటి సగం కొన్ని చోట్ల lag అనిపించింది
గమనిక: ఇది హిందీ వెర్షన్ రివ్యూ.

Also Read News

Scroll to Top