Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం..4 రోజుల్లో 100 కోట్లు.. 10 రోజుల్లో 200 కోట్లు..

Share the news
Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం..4 రోజుల్లో 100 కోట్లు.. 10 రోజుల్లో 200 కోట్లు..

Jai HanumaN వీరంగం..

బాలరాముడు భారతీయుల మనోభిరాముడి ప్రాణప్రతిష్ట రోజు రికార్డులను నెలకొల్పిన ‘హనుమాన్‌’.
అటు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా, జనకోలాహాలంగా జరుగుతుండగా, ఇటు మరోవైపు తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల విడుదలైన హనుమాన్‌ చిత్రం, సరికొత్త రికార్డును నెలకొల్పింది. పెద్దగా ఆశలు, అంచనాలు లేని ఒక చిన్న సినిమాగా విడుదల అయిన ‘హనుమాన్‌’ చిత్రం ఇపుడు బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ళ పరంగా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పవచ్చు.

సంక్రాంతి పండుగల సినిమా ర్యాలీలో వచ్చిన ‘హనుమాన్‌’ చిత్రం కేవలం రూ. 45 కోట్లతో తెరకెక్కించారు. అయితే అనూహ్యమయిన వసూళ్ళను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పదిరోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు ఆ చిత్రం మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం (2024)లో రెండొందల కోట్ల రూపాయలను వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగానే కాకుండా తొలి భారతీయ సినిమాగా ‘హనుమాన్’ రికార్డు సృష్టించింది. బాలీవుడ్‌లో ఈ సినిమా దుమ్ము రేపిందని చెప్పాలి. ప్రస్తుతం నార్త్‌ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్‌ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి.

See also  Chiranjeevi Biography: చిరంజీవి జీవిత చరిత్రను రాయునున్న ప్రముఖ రచయిత యండమూరి

Jai HanumaN: ఒక టికెట్‌ కొంటే ఇంకొకటి ఉచితం..
అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం (జనవరి 22) సందర్భంగా యూఎస్ఏ(USA)లో,కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన స్క్రీన్స్‌లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్‌ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్ సినిమాకు ‘బై వన్‌ గెట్‌ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫ‌ర్ ఇస్తున్నట్లు ప్ర‌క‌టించింది.

బుక్ మైషోలో ‘MIRAJBOGO’ అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది

Jai Hanuman

ప్రశాంత్‌ వర్మ(Prashant Varma) డైరెక్ట్‌ చేసిన హనుమాన్‌ చిత్రంలో తేజ సజ్జా(Teja Sajja) హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు.

See also  Hanuman Trailer: అద్భుతమైన దృశ్యకావ్యం

ఈ విజయంతో ప్రశాంత్ వర్మ Jai HanumaN సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి

-By ముత్తోజు సత్యనారాయణ, Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top