Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా!

Share the news
Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా!

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు(Butchi Babu) కాంబినేషన్ లో తెరకెక్కబోయే RC 16 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కి సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు నెట్టింటిలో వైరల్ అవుతుంది. అదేమిటంటే Ram Charan RC 16 లో హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor) కంఫర్మ్ అయ్యింది.

హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారనే వార్త పది రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది కానీ అది ఖచ్చితమైన వార్త కాదు. టీమ్ స్పందించ లేదు. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ స్వయంగా ఒక మీడియా ఛానల్ తో చేసిన ఇంటర్వ్యూ లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన కూతురు రామ్ చరణ్ సరసన నటించబోతోందని, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని, తనకు లభించిన మంచి అవకాశమని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు చిరంజీవి – శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఎంతటి ఇండస్ట్రీ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి(Chiranjeevi) తనయుడు రామ్ చరణ్ తో శ్రేదేవి తనయ జాన్వీ కపూర్ జోడి కట్టడం ప్రేక్షకుల్లో ఆసక్తి, సినిమాకు హైప్ పెరగడం ఖాయం.

See also  Vishwambhara Movie Update: చిరంజీవి విశ్వంభర క్యాస్ట్ లో జాయిన్ అయిన మరో హీరోయిన్!

ఇక RC 16 బృందం చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ వెంటనే రామ్ చరణ్ తో జోడి కట్టే అవకాశం రావడం అదృష్టమే. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా జాన్వీ పెద్ద రేంజ్ కు వెళ్లలేకపోతోంది. తారక్, చరణ్ ల చిత్రాలతో తాను జాక్ పాట్ కొట్టేయడమే కాదు ఇండస్ట్రీ లో పెద్ద రేంజ్ కు వెళ్లడం ఖాయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top