Mega Family Sankranti celebrations: చిరంజీవి ఇంట మెగా ఫ్యామిలీల సంక్రాంతి సంబరాలు..

Share the news
Mega Family Sankranti celebrations: చిరంజీవి ఇంట మెగా ఫ్యామిలీల సంక్రాంతి సంబరాలు..

Mega Family Sankranti celebrations

మెగా ఫ్యామిలీ ఈ సంక్రాంతిని ఎప్పటిలానే ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతీ పెద్ద పండగకు అన్ని కుటుంబాల నుంచి ప్రతీ ఒక్కరూ ఒకే చోటకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ సారి సంక్రాంతి వేడుకల్ని రామ్ చరణ్ ఉపాసన కలిసి నిర్వహించినట్టుగా తెలుస్తోంది . క్లీంకారా పుట్టిన తరువాత వచ్చిన ఫస్ట్ సంక్రాంతి కావడంతో మరింత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఈ మెగాసెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోను చిరంజీవి మరియు సాయి ధరమ్ తేజ్ షేర్ చేశాడు. ఆ ఫోటోను చూడటానికి రెండు కళ్లు చాలవేమో అన్నట్టుగా ఉంది.

అందరూ డ్రెస్ కోడ్ వాడారు. ఆడవారు ఒకే రకమైన చీరకట్టులోకనిపించారు. ఒకే రంగులో దుస్తుల్ని డిజైన్ చేయించుకున్నారు. ఇక మగవాళ్లు అంతా కూడా ఒకే కలర్ కనిపించేలా డిజైనర్ దుస్తుల్ని ధరించినట్టుగా కనిపిస్తోంది.అయితే ఎవరెక్కడ ఉన్నారు అని వెతుక్కోవడానికే కొంచెం టైం పట్టేలా ఉంది.

See also  Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి

Mega Family Sankranti celebrations లో చిరంజీవి(Chiranjeevi) , నాగబాబు, అరవింద్, బన్నీ(Allu Arjun), రామ్ చరణ్(Ram Charan), కొత్త జంట వరుణ్ ప్యామిలీలు ఇలా ఒకరేంటి దాదాపు అందరూ వున్నారు. ఒక పవన్ ప్యామిలీ తప్ప. అయితే పవన్ ప్యామిలీ నుంచి అకిరా నందన్, ఆద్య వచ్చారు. కానీ ఇందులో అకిరాను ఈజీగా గుర్తు పట్టలేరేమో. పైగా అకిరా నందన్ మొదటి సారి ఇలా గడ్డంతో కనిపించాడు. వరుణ్ తేజ్ ముందు అలా సింపుల్‌గా కూర్చున్నాడు. పక్కనే ఆద్య కూడా ఉంది. క్లీంకారాను అయితే లవ్ గుర్తుతో కవర్ చేశారు కనపడకుండా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top