
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాలార్ దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో క్రేజ్ సృష్టించింది. ఈ చిత్రానికి తొలిరోజు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ ను ఎలివేట్ చేస్తూ ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Salaar కు మెగాస్టార్ విషెస్
కాగా, మెగాస్టార్ చిరంజీవి తన స్టైల్‌లో సాలార్ చిత్రాన్ని సమీక్షించారు.
చిరంజీవి తన ట్వీట్‌ని ఇలా వ్రాస్తూ, “నా ప్రియమైన ‘దేవా’ #రెబెల్‌స్టార్ #ప్రభాస్‌కు హృదయపూర్వక అభినందనలు. #SalaarCeaseFire బాక్సాఫీస్‌ను మంటల్లోకి నెట్టింది 🔥🔥.
చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇతర నటీనటులు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతి బాబు మరియు సినిమాకు పనిచేసిన అద్భుతమైన సిబ్బందిని కూడా చిరు అభినందించారు.
