
లాక్ డౌన్ లో చాలా యూ ట్యూబ్ ఛానల్స్, కామెడి వీడియోస్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ క్లిక్ అయ్యాయి. అలా క్లిక్ అయిన అకౌంట్స్ లో “మౌలీ టాక్స్”(moulitalks) ఒకటి. అయితే సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించిన మౌలీ తాజాగా 90s – ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.
Moulitalks in Trouble
దాంట్లో ఉన్న కొన్ని కామెడి సీన్స్, తాను చేసిన క్యారక్టర్ అందరికీ నచ్చి ఇంకా ఎక్కువ ఫెమ్ సంపాదించాడు మౌలీ… అంతే కాకుండా చాలా రోజులకు వాసుకి, శివాజీ వంటి వారు కమ్ బ్యాక్ ఇచ్చినట్టుగా అయింది. ఈ 90s వెబ్ సిరీస్ నెట్టింట్లో మీమర్స్, ట్రోలర్లకు బాగానే పనికొచ్చింది. అయితే ఇప్పుడు మౌలీ చిక్కుల్లో పడ్డాడు… తాను వేసిన ఒక జోక్ బాగా వైరల్ అయి పోలిటీషియన్స్ అతనిపై మండిపడుతున్నారు.. అసలేమైందో తెలుసుకుందాం…
మౌలి తాజాగా ఓ వీడియోతో వైరల్ అవుతున్నాడు. అందులో ఓ మ్యాజిక్ చేస్తాను అని చేయి మూసి పెట్టాడు. చేతిని తీసి.. అందులోంచి ఒక దాన్ని మాయం చేశా.. అది ఏంటో తెలుసా? ఏపీ క్యాపిటల్.. చూసుకోండి.. ఎక్కడా దొరకదు.. కనిపించదు అంటూ మౌలి కామెడీ చేశాడు. దీంతో ఈ వీడియో మీద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు.
టీడీపీ నాయకులు ఈ వీడియోను షేర్ చేస్తూ.. మన స్టేట్, క్యాపిటల్ అంటే అందరికీ లోకువయ్యేలా చేశారు కదా అంటూ కౌంటర్లు వేశారు. ఇవన్నీ నీకెందుకు బ్రో అంటూ వైసీపీ కార్యకర్తలు మౌలి వీడియో మీద రియాక్ట్ అవుతున్నారు.
ఇదంతా కూడా శివాజీ ట్రైనింగ్ అయి ఉంటుంది అని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.ఈ వీడియోతో మౌలి మరోసారి నెట్టింట్లో మాత్రం హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఇదువరకే ఏపీ క్యాపిటల్ గురించి గతంలో చాల చర్చలు, ట్రోల్స్ వచ్చాయి.. మరి ఈ సీరియస్ గా మారిన కామెడి మౌలి కి ఇంకెన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతుందో చూడాలి….
ఎందుకంటే తన సోషల్ మీడియా హ్యాండిల్ లో చేసిన రీసెంట్ ట్వీట్ లో మౌలి మాట్లాడుతూ “నేను ఏ కామిడీ చేసిన నా పర్సనల్ అభిప్రాయాలను రుద్దను… ఆడియన్స్ ని నవ్వించాలి అనే అలా అన్నాను తప్పితే నాకు వేరే ఉద్దేశ్యం ఏమి లేదు… దేన్నీ తక్కువ చెయ్యాలని అనుకోను… నేను హెల్తీ కామెడి మాత్రమె చేస్తాను.. దీంట్లోకి నా పేరెంట్స్ ని లాగకండి నన్ను క్షమించండి” అని ఉంది.
ఈ ఇంసిడెంట్ గురించి మాట్లాడుతూ పేరెంట్స్ గురించి మాట్లాడాడు అంటే కచ్చితంగా వైసిపీ నాయకులూ మౌలి ని ఇబ్బంది పెట్టి ఉంటారు అని కొందరు మండిపడుతుంటే కొంతమంది మాత్రం మేము నీకు సపోర్ట్ చేస్తాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
moulitalks Video:
Because of you, unworthy CM @ysjagan, today our state enduring this type of low-grade comedy#HelloAP_VoteForJanaSenaTDP pic.twitter.com/67sYpR050m
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) February 6, 2024
-By Pranav @ samacharnow.in