Naa Saami Rangaa movie review: నా సామి రంగా.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది..

Share the news
Naa Saami Rangaa movie review: నా సామి రంగా.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది..

Naa Saami Rangaa review

నటీనటులు: అక్కినేని నాగార్జున – అల్లరి నరేష్ – ఆషిక రంగనాథ్ – రాజ్ తరుణ్ – నాజర్ – మిర్నా మేనన్ – రుక్సర్ దిల్లాన్ తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: శివేంద్ర
రచన: ప్రసన్న కుమార్ బెజావాడ
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
స్క్రీన్ ప్లే -దర్శకత్వం: విజయ్ బిన్నీ

Naa Saami Rangaa కథ టూకీగా

కధ నేపథ్యం 1988లో జరుగుతుంది. కోనసీమలో ఒక చిన్న గ్రామంలో కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) రక్తం పంచుకోకపోయినా అన్నదమ్ముల కన్నా ఎక్కువ ప్రేమగా వుంటారు. ఇల్లు జఫ్తు కాకుండా కాపాడిన పెద్దయ్య(నాజర్)ను దేవుడిలా చూస్తుంటారు. పొరుగూరి అమ్మాయిని ఇష్టపడి చిక్కుల్లో పడ్డ భాస్కర్(రాజ్ తరుణ్) వీళ్ళ స్నేహితుడు. చిన్నప్పటి నుంచే వరాలు(ఆశికా రంగనాథ్)ని ప్రేమించిన కిష్టయ్య ఆమె తండ్రి(రావు రమేష్) వల్ల పెళ్లి చేసుకోకుండా ఉన్న ఊళ్ళోనే 10 ఏళ్ళు దూరంగా గడిపేస్తాడు. మరి వీళ్ళిద్దరిని కలపడానికి అంజి ఏం చేశాడు. పెద్దయ్య చిన్న కొడుకు దాస్ (షబ్బీర్) దుబాయ్ నుంచి వచ్చాక గొడవలు మొదలవుతాయి. పెద్దయ్య కుటుంబంతో కిట్టయ్యకు తలెత్తిన వైరం ఎక్కడిదాకా వెళ్ళింది.. ఈ విషయాలు తెరమీద తెలుసుకోవాలి అంటే Naa Saami Rangaa చూడాల్సిందే.

విశేషణ

‘సోగ్గాడే..’ను అనుకరిస్తున్నట్టుగా అనిపించే నా సామి రంగ(Naa Saami Rangaa).. పండక్కి పైసా వసూల్ సినిమాలా అనిపించక పోయిన పర్వాలేదనిపిస్తుంది. ఒక విలేజ్ డ్రామాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కాకపోతే కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కొత్త కథ.. గొప్ప మలుపులు.. వావ్ అనిపించే సన్నివేశాలు లేకపోయినా రెండున్నర గంటలు టైం పాస్ చేయడానికి అయితే పర్వాలేదనిపిస్తుంది. నాగార్జున ‘సోగ్గాడే..’ తరహాలోనే సాగే పాత్రను ఈజ్ తో చేసుకుపోగా.. తెర పైన కనిపించినప్పుడల్లా ఆషిక తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేసింది. వయసు అంతరం ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ పరవాలేదు. మరోవైపు నాగార్జున, నరేష్(Naresh) మధ్య బంధాన్ని కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. మిగతా అంశాలు పెద్దగా ఎంగేజ్ చేయకపోయినా.. ఈ పాత్రలు.. వీటి మధ్య డ్రామా సినిమాను నడిపిస్తాయి. రెండు ఊర్ల మధ్య గొడవ.. పండగ ప్రభల వ్యవహారం.. అవేవీ అంత ఆసక్తికరంగా అనిపించవు.

See also  Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు?

హీరో ఎలివేషన్స్ సీన్లు.. మిగతా సన్నివేశాలు కొంత సో సో అనిపించినా తన నేపథ్య సంగీతంతో కీరవాణి వాటిని నిలబెట్టాడు. ప్రేక్షకుల ఉత్సాహం తగ్గకుండా చూడడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. విలన్ పాత్ర మొదట్లో పర్వాలేదు అనిపిస్తుంది కానీ.. రాను రాను అది దశ దిశ లేకుండా సాగుతుంది. ప్రధమార్ధంలో లవ్ ట్రాక్.. విలేజ్ డ్రామా.. కామెడీ సమపాళ్లలో నా సామిరంగ చక చకా సాగిపోతుంది. కానీ ద్వితీయార్థంలో ఆ ఊపు కొనసాగలేదు. పడుతూ లేస్తూ సాగే కథనం ప్రేక్షకులకు మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అల్లరి నరేష్ పాత్రతో కథను మలుపు తిప్పడం బావుంది. అక్కడ ఎమోషన్ పండింది, క్లైమాక్స్ హడావిడిగా లాగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో స్టాండ్ అవుట్ గా నిలిచే.. వావ్ అనిపించే ఎపిసోడ్లు అయితే లేవు కానీ సినిమా పెద్దగా బోర్ కొట్టకుండా అలా అలా సాగిపోతుంది. . మూడు ప్రధాన పాత్రలు ఆకట్టుకోవడం.. మంచి సంగీతం.. నా సామి రంగకు(Naa Saami Rangaa) ప్లస్. పర్ఫెక్ట్ సినిమా కాదు కానీ పండక్కి ఓకే.

See also  Dasara Villain Funny Video: దసరా విలన్ వీడియో వైరల్.. అంతగా ఏముంది ఆ వీడియో లో?

నాగార్జున కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ మాస్ క్యారెక్టర్ వేసి మెప్పించాడు. ఆయన పాత్రలో నటనలో చాలావరకు సోగ్గాడే చిన్నినాయన ఛాయలు కనిపిస్తాయి. రంగస్థలం షేడ్స్ అక్కడక్కడా ఫీలవుతాం.. గోదావరి పల్లెటూరి స్లాంగ్ అవి బానే కుదిరాయి. ఫన్.. యాక్షన్.. రొమాంటిక్ సీన్లలో బాగా చేసిన నాగ్.. ఎమోషనల్ సీన్లలో మాత్రం సాధారణంగా అనిపించాడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆమె అందం.. అభినయం కట్టి పడేస్తాయి. నరేష్ అంజి పాత్రను అతను అలవోకగా చేసేశాడు. తన పాత్ర.. నటన చాలా సహజంగా అనిపిస్తాయి. రాజ్ తరుణ్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. మిర్ణా మేనన్ బాగానే చేసింది. రుక్సర్ పాత్ర.. నటన మొక్కుబడిగా సాగాయి. విలన్ పాత్రలో నటించిన కొత్త నటుడు పరవాలేదు. నాజర్ కు ఇలాంటి పెద్ద మనిషి పాత్రలు కొట్టిన పిండే.

ఇక Naa Saami Rangaa లో అందరి కన్నా బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చింది కీరవాణినే(Keeravani). కొన్ని పాటలు వినసొంపుగా. కొన్ని హుషారుగా అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు హై తెచ్చింది. శివేంద్ర దాశరథి విజువల్స్ సినిమా శైలికి తగ్గట్లుగా సాగాయి. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. బడ్జెట్ పరిమితులు తెలిసిపోతాయి. ప్రసన్న కుమార్ డైలాగ్స్ పల్లెటూరి శైలిలో పరవాలేదు. దర్శకుడు విజయ్ బిన్నీ వీక్ స్క్రిప్టు తెర మీద ఉన్నంతలో బాగానే ప్రెజెంట్ చేశాడు. కొత్త దర్శకుడు అయినా కొన్ని సీన్లు అనుభవజ్ఞుడిలా డీల్ చేశాడు. అదే సమయంలో అనుభవ లేమి కూడా కొన్ని చోట్ల కనిపించింది. ఒక ఫ్లోతో సినిమాను నడిపించలేకపోయాడు.

See also  Allu Arha Viral Video: యానిమల్ పాటకి అల్లు అర్హ స్టెప్పులు

ఓవర్ అల్ గా Naa Saami Rangaa.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది..

ఇక చివరగా

మన సీనియర్ హీరోలు ఎంత త్వరగా మారితే అంత మంచిది. పాత చింతకాయ పచ్చడి తరహా కధ, కధనాల మాని ఇప్పటి జనరేషన్ అభిరుచులకు తగ్గ సినిమాలు చేస్తే మంచిది. ప్రశాంత్ వర్మ లాంటి కొత్త తరం దర్శకులకు అవకాశం ఇచ్చి ఫ్రీడమ్ ఇస్తే మంచి అవుట్ ఫుట్ ఇస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top