
అభిమానులందరూ కూడా అమ్మ గురించి ప్రార్థించండంటూ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) వేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆర్ఎక్స్ 100(RX 100) తో తెలుగులో మంచి విజయాన్ని సాధించిన పాయల్ రాజ్ పుత్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. అంతకు ముందు బాలీవుడ్‌లో సీరియల్స్ చేసుకుంటూ ఉండేది పాయల్. పంజాబీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాల్లో నటించింది కానీ తెలుగులో మంచి ఆదరణ లభించేసరికి ఇక్కడే తన కెరీర్‌ను చూసుకుంటోంది.
పాయల్‌కు అందం, నటించగలిగే సత్తా ఉన్నా కూడా తనకి ఎక్కువ సినిమాల్లో అవకాశాలు రావడంలేదు. రీసెంట్ గా విడుదలైన మంగళవారం సినిమాతో పాయల్‌కు మంచి విజయమే వచ్చింది. డైరెక్టర్ అజయ్ భూపతి మళ్లీ పాయల్‌ను ఎలా చూపించాలో అలా చూపించాడు. ఆమెను ఎలా చూపిస్తే.. ఎలా యాక్ట్ చేయిస్తే ఆడియెన్స్‌కు నచ్చుతుందో అలానే చేయించాడు.
మా అమ్మ గురించి ప్రార్ధించండి – Payal Rajput
ఇక అసలు విషయానికి వస్తే పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తన తల్లికి సర్జరీ చేయించింది. మోకాళ్లకు జరిగిన ఈ ఆపరేషన్ చాలా పెయిన్ ఫుల్‌గా ఉందని, అయినా ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా జరిగిందని, అభిమానులందరూ కూడా అమ్మ గురించి ప్రార్థించండంటూ పాయల్ వేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆపరేషన్ అనంతరం అమ్మ ఎలా నడుస్తోందో కూడా పాయల్ చూపిస్తూ ఇంస్టా స్టోరీలో వీడియోను షేర్ చేసింది. పాయల్ ప్రస్తుతం అమ్మ వద్దే ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఇక ప్రస్తుతం పాయల్ గోల్మాల్, ఏంజెల్ అనే రెండు తమిళ సినిమాల్లో, కిరాతక అనే తెలుగు సినిమాలో నటిస్తుంది
-By Pranav @ samacharnow.in