
Ram Charan తో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన ఖాన్‌ల త్రయం!
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఇంట పెళ్లి సందడి నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. తన రెండవ కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత వీరెన్ మర్చంట్ కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్ నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా సినీమా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, దేశ విదేశాలకు చెందిన ప్రధానులు హాజరు అవుతున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్సులతో తెగ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక మన RRR స్టార్ రామ్ చరణ్(Ram Charan) జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సంగీత్ లో నాటు నాటు దరువులకు బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్(Sharukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan) మరియు అమీర్ ఖాన్‌ల(Amir Khan)తో కలసి నృత్యం చేయడానికి వేదికపైకి వచ్చారు.
ఒక వైరల్ వీడియోలో షారుఖ్ మరియు సల్మాన్ తమతో చేరమని రామ్ చరణ్‌ను పిలుస్తున్నట్లు చూడవచ్చు మరియు వారు కలిసి నాటు నాటు హుక్ స్టెప్‌ను పునఃసృష్టించి ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపారు.
Whaatt a high moment ❤️🤩@AlwaysRamCharan @iamsrk@BeingSalmanKhan#AmirKhan pic.twitter.com/TYrTTCtp6j
— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2024