Ram Charan Game Changer సెప్టెంబర్ 2024 లో రిలీజ్ అవబోతుందా !

Ram Charan Game Changer: మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లో విడుదల కావచ్చునని తెలుస్తోంది
Share the news
Ram Charan Game Changer సెప్టెంబర్ 2024 లో రిలీజ్ అవబోతుందా !

Ram Charan Game Changer రిలీజ్ గురించి నిర్మాత దిల్ రాజు, మొన్న Salaar ప్రీమియర్ చూసి బయటికి వస్తున్న సందర్భంలో గుంపులో నుంచి ఒక సినీ అభిమాని మా సినిమా రిలీజ్ ఎప్పుడని అడగటం జరిగినట్లు తెలుస్తోంది, దానికి ఆయన స్పందిస్తూ సెప్టెంబర్ అని చెప్పింది మైకులో స్పష్టంగా వినిపించడం జరిగింది. ఒకవేళ రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశం లేకపోతే వినిపించనట్టు వెళ్ళిపోయేవారు కానీ నెల పేరుని నొక్కి చెప్పడం చూస్తే ఖరారు అని అనుకోవచ్చు.

Ram Charan Game Changer: రిలీజ్ డేట్

SSV నుంచి అనఫీషియల్ గా అందుతున్న సమాచారం ప్రకారం Ramcharan Game Changer ని సెప్టెంబర్ 6, 2024 న తీసుకురాలని ప్రాధమికంగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ కూడా అంగీకరించారని వినికిడి. ఇండియన్ 2 ఏప్రిల్ లేదా ఆగస్ట్ లో విడుదలవడం ఖాయమే కాబట్టి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయించి ఫస్ట్ కాపీ ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే గేమ్ ఛేంజర్ కోసం 2025 సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సి వస్తుందని నిరాశ పడిన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్టే. అధికారికంగా అయితే ఇంకా రిలీజ్ డేట్ చెప్పలేదు.

See also  RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి!

సెప్టెంబర్ ఎలాగూ బాక్సాఫీస్ పరంగా అది మంచి నెలే కాబట్టి మంచి ఓపెనింగ్స్ కి టెన్షన్ పడాల్సిన పని లేదు. సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పండగ ఉంది. గత కొన్ని నెలలుగా దిల్ రాజుని గేమ్ ఛేంజర్ గురించి అడిగినప్పుడంతా శంకర్ మీదకు తోసేసి స్మార్ట్ గా తప్పించుకుంటున్నారు తప్ప ఫలానా టైం అని చెప్పలేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ పీరియాడిక్ డ్రామాలో సూర్య విలన్ గా నటించాడు. చూస్తుంటే చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు త్వరలో తీరిపోయేలానే ఉన్నాయి.

Also Read News

Scroll to Top