
రామ్ చరణ్ ప్రస్తుతం మైసూర్(Mysore) లో Game Changer Shoot లో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. RRR తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఇది కాస్త కూస్తా కాదు చాలా లేట్ చేస్తూ నిర్మాత మరియు అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. Ram Charan ఏమో ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి వెంటనే బుచ్చిబాబు ప్రాజెక్ట్ లాంచ్ చేయాలని చూస్తున్నాడు.
Ram Charan in Chamundeshwari Temple
రామ్ చరణ్ ఎప్పుడూ కూడా దైవ చింతన, ఆధ్యాత్మిక ధోరణిలోనే ఉంటాడు.ఇదిగో ఇప్పుడు ఇలా మైసూరులోని చాముండేశ్వరి దేవాలయంలో కనిపించాడు. అక్క డ అమ్మవారిని దర్శించుకున్నాడు. ఇక ఈ షెడ్యూల్‌తో గేమ్ చేంజర్ షూటింగ్‌లో మేజర్ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ మూవీ థియేటర్లోకి వచ్చేలా కనిపిస్తోంది. ఈ మూవీని వందల కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాడు.