RRRని వదలని జపాన్ ప్రేక్షకులు

Share the news

తెలుగు ప్రేక్షకులు RRR ని థియేటర్లలో, టీవీ, ఓటిటి, స్మార్ట్ ఫోన్లలో లెక్కలేనన్ని సార్లు చూసిన తరువాత RRR ఫీవర్ తగ్గింది. కానీ జపాన్ జనాలని మాత్రం ఇప్పట్లో ఈ ఆర్ఆర్ఆర్ ఫీవర్ వదిలేలా లేదు. ఇప్పటికే 300 రోజులకు పైగా ఆడేసింది. ఇన్ని రోజులు ఆడిన కూడా వాళ్ళ మోజు తీరలేదు. రానున్న జనవరి 5 న ఫ్రెష్ గా మళ్ళీ సరికొత్త ఐమాక్స్ ప్రింట్లతో మళ్ళీ విడుదల చేయబోతున్నారు. విచిత్రం ఏంటంటే మెయిన్ స్క్రీన్స్ బుకింగ్స్ పెడుతుంటే టికెట్లు చాలా వేగంగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి అంట .

RRRని వదలని జపాన్ ప్రేక్షకులు

RRR జపాన్ వసూళ్లు

జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే. ఇది 2.345 బిలియన్ యెన్‌లకు పైగా వసూలు చేసింది, ఇది మన కరెన్సీలో దాదాపు రూ. 140 కోట్లు. గతంలో ఉన్న ముత్తు రికార్డుని బద్దలు కొట్టి సింహాసనం స్వంతం చేసుకుంది. అక్కడి ఆడియన్స్ కి మన కంటెంట్ కనెక్ట్ అవ్వాలే కానీ నెత్తిన పెట్టుకుంటారని చాలా సార్లు రుజువయ్యింది, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇద్దరు స్వతంత్ర సమరయోధుల కాల్పనిక కథని రాజమౌళి చూపించిన తీరు జపాన్ పబ్లిక్ కి పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. దాని ఫలితంగానే రెండేళ్ల తర్వాత కూడా ఈ స్థాయి స్పందన కనిపిస్తోంది.

See also  Anand Mahindra: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? రామ్ చరణ్ ఫిర్యాదుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా!

నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ వందల మిలియన్ల వ్యూస్ తెచ్చి నెట్ ఫ్లిక్స్ రీచ్ కి చాలా ఉపయోగపడింది. తెలుగు ఒరిజినల్ వెర్షన్ లేకపోయినా ఇంత ఆదరణ దక్కడం చూసి ఆ ఓటిటి వర్గాలు ఆశ్చర్యపోయాయి. అమెరికాలోనూ అడపాదడపా రెండు నెలలకోసారి షోలు వేస్తున్నారు. ఆస్కార్ వచ్చాక ట్రిపులార్ క్రేజ్ విదేశీయుల్లో విపరీతంగా పెరిగిందన్నది నిజం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top