Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా!

Share the news
Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా!

Oscars 2024 నాటు నాటు: ఆస్కార్ చరిత్రలో ‘నాటు నాటు’ పాటకు, RRR చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. 95 ఏళ్ల ఆస్కార్ అకాడమీ అవార్డుల చరిత్రలో భారత్ దేశానికి ఆస్కార్ తీసుకు వచ్చిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేశాయి.

Oscars 2024 వేడుక లో RRR చిత్ర బృందానికి డబుల్ ధమాకా..

లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్, అమెరికాలో జరిగిన ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ (The Academy Awards 2024) 96వ అవార్డుల వేడుకలో రెండుసార్లు స్టేజి మీద ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ ప్రదర్శించారు.

ఆస్కార్స్ 2024 బెస్ట్ సాంగ్ అనౌన్స్ చేసినప్పుడు..
Naatu Naatu song on Oscars stage again: ఆస్కార్స్ 2024లో ‘బార్బీ’ సినిమాలోని ‘వాట్ వజ్ ఐ మేడ్ ఫర్’ అనే పాటకు ఆస్కార్ వచ్చింది. బిల్లీ ఐలిష్, ఫిన్నియస్ ఓ కానల్ అవార్డు అందుకున్నారు. విజేతలైన ఆ ఇద్దరి పేర్లు అనౌన్స్ చేయడానికి ఇద్దరు అందాల భామలు వేదికపైకి వస్తున్న సమయంలో వెనుక ‘నాటు నాటు…’ సాంగ్ విజువల్స్ ప్లే చేశారు. పాటలో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) వేసిన హుక్ స్టెప్ కనిపించింది.

స్టంట్స్ గురించి ప్రస్తావించినప్పుడు…
RRR team surprised by Oscar Academy: ‘ఆర్ఆర్ఆర్’ అంటే నాటు నాటు పాట ఒక్కటే కాదు… కథ, కథలోని ఎమోషన్, దాని నుంచి వచ్చిన యాక్షన్ / స్టంట్ సీక్వెన్సులు కూడా! ముఖ్యంగా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన స్టంట్స్ భాషలకు అతీతంగా ప్రపంచ ప్రేక్షకుల్ని ఎంత గానో అలరించాయి. ఇప్పుడు ఆ స్టంట్స్ కు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్స్ మరోసారి గుర్తింపు తెచ్చింది. RRR Stunts recognized by Oscars 2024 again.

See also  రామ చరణ్ Game Changer నుంచి మొదటి సింగల్ జరగండి జరగండి అవుట్!

సినిమా కోసం జీవితాలను పణంగా పెట్టేది స్టంట్ కమ్యూనిటీ అని ఆస్కార్స్ స్టేజి మీద స్టంట్ మాస్టర్స్ గొప్పతనాన్ని వివరించారు. ఆ క్రమంలో ప్రపంచ సినిమాలోని ది బెస్ట్, గ్రేటెస్ట్ స్టంట్స్ కొన్నిటిని ప్రదర్శించారు. అందులో ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన స్టంట్ సీక్వెన్సుకు చోటు కల్పించారు.

ఈ డబుల్ సర్‌ప్రైజ్ ని అసలు ఊహించని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top