
Sankranti Box Office Report
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడిన విషయం తెల్సిందే. వాటిలో మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram), తేజ సజ్జ(Teja Sajja) హనుమాన్(HanumaN) జనవరి 12న రిలీజ్ అవగా మరునాడు జనవరి 13న వెంకటేష్(Venkatesh) సైంధవ్(Saindhav), 14న నాగార్జున(Nagarjuna) నా సామిరంగ(Naa Saami Ranga) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ నాలుగు సినిమాలలో హనుమాన్ సినిమాకి Unanimous గా బ్లాక్ బస్టర్ టాక్ రాగా మిగతా వాటికి మిశ్రమ ఫలితాలు ఇచ్చారు ప్రేక్షకులు. ఇక మొదటి వీకెండ్ Sankranti Box Office Report ఒక సారి చూద్దాం పదండి.. వసూళ్లను బట్టి ఏ సినిమాకి ప్రేక్షుకుల ఆదరణ ఎక్కువ చూపిస్తున్నారో తెలుసుంకుందాం.
Also Read: గుంటూరు కారం – మహేష్ మాస్, తేలిపోయిన త్రివిక్రమ్ దర్శకత్వం..
Sankranti Box Office Report
ఇండియా నెట్ కలెక్షన్లు కోట్ల రూపాయల్లో (including all languages)
Date/Movie | గుంటూరు కారం | హనుమాన్ | సైంధవ్ | నా సామిరంగ |
12.1.2024 | 41.3 | 8.05 | – | – |
13.1.2024 | 13.55 | 12.45 | 3.8 | – |
14.1.2024 | 15.02 | 16 | 2.95 | 5 |
Total | 69.87 | 40.65 | 6.75 | 5 |
Note: Hanuman Total collections including 4.15cr from premiers
ఇక USA Sankranti Box Office Report చూసినట్లయితే..
హనుమాన్ ఇప్పుడు USA ప్రాంతంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాని బీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం హనుమాన్ దాదాపు 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, గుంటూరు కారం ప్రస్తుతం USA బాక్సాఫీస్ వద్ద 2.16 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది.
Also Read: భారతీయ పురాణాలను, సూపర్ హీరో కాన్సెప్ట్ ను అద్భుతంగా మిళితం చేసిన ప్రశాంత్ వర్మ!
ఇక ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తీసిన హునుమాన్ కి మొదటి ఆట నుండే బ్రహ్మాండమైన టాక్ రావడం తో రెండవ రోజు నుండే థియేటర్లు బాగా పెంచేశారు.. ఎన్ని పెంచినా కూడా బుక్ మై షో లో అన్ని ఫుల్ చూపిస్తున్నాయి. దీని వల్ల రెండో రోజునుంచి Hanuman మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మూడవ రోజున గుంటూరు కారం కలెక్షన్స్ ని దాటేసింది కూడా. ఇక నార్త్ లో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 13+ కోట్ల నెట్ వసూల్ చేసింది అక్కడ. ఇదే ట్రెండ్ కొనసాగినట్లైతే ఫైనల్ రన్‌లో హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read: Saindhav Movie Review: చిన్నోడి దారి లోనే పెద్దోడు
ఇంకో విషయం, క్రేజు ఉన్న సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ప్రేక్షుకులు బాగా ఆదరిస్తున్నారు ఇప్పుడు. ఒక సినిమా బావుంది అంటే చాలు ఆ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడానికి కొన్ని గంటలు చాలు. అది చిన్న హీరో సినిమా అయినా సరే కోట్లు కురిపిస్తున్నారు. హునుమాన్ దానికి ఒక క్లాసిక్ ఉదాహరణ.
Also Read: నా సామి రంగా.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది..
ఇక చివరిగా.. సంక్రాంతి సీజన్ సినిమాలకు పెద్దదే కానీ మరీ నాలుగు సినిమాలను రిలీజ్ చేసేటంత కాదు. ఇద్దరు పెద్ద హీరోల సినిమా, ఒక చిన్న సినిమా వరకు ఓకే. ఈ గుణపాఠం మన నిర్మాతలు నేర్చుకుని వచ్చే సంక్రాంతికి జాగ్రత్త పడతారని ఆశిద్దాం
Note: Box office numbers are based on estimates and various sources. Numbers have not been independently verified by Samachar Now