Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు?

Share the news
Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు?

Sankranti Movies 2024:

“గుంటూరు కారం”(Guntur Kaaram) మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో వస్తోంది.అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా. త్రివిక్రం కూడా మహేష్ మాస్ మూమెంట్స్ మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తోంది. మరో ఖలేజానా..అలవైకుంఠపురమా అన్నది ప్రేక్షకులు రేపు తేల్చేస్తారు. ట్రైలర్ వచ్చేవరకు ఎక్కడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.ట్రైలర్ జనాల్లోకి బాగా వెళ్ళింది. పూర్తి మాస్ బ్లాస్ట్ లా వుంది.

ఇక “హనుమాన్”(HanumaN) సినిమా ఫాంటసీ, మంచి విఎఫ్ఎక్స్ ఉన్నాయని ట్రైలర్ ద్వారా పేరు తెచ్చుకుంది. హిందీలో బెల్ట్ లో కూడా రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే నార్త్ లో “బజ్” ఎక్కువుంది. పెద్ద హీరోల సినిమాల వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తక్కువిచ్చారన్న టాక్ ఉంది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ లో ఇది మొదటి చిత్రం. మహేష్ బాబు యువరాజ్ చిత్రంలో బాలనటుడిగా నటించిన తేజా సజ్జా(Teja Sajja) ఇప్పుడు హీరో గా మహేష్ బాబుతో పోటీ పడటం విశేషం

See also  Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి..

“సైంధవ్”(Saindhav) వెంకటేష్ 75వ చిత్రం.డైరక్టల్ డా.శైలష్ కొలను హిట్ సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు. చిన్నపిల్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.మొదటిసారి నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో నటిస్తూ తన డబ్బింగ్ తనే చెప్పుకున్నాడు. ప్యామిలీ సెంటిమెంట్ తో పాటు మాస్ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయి ట్రైలర్ లో.

ఇక ఇటీవలికాలంలో నాగార్జునకు సంక్రాంతి కలిసొస్తోంది.అందుకే ఫ్లాపుల నుంచి బయటపడ్డానికి సంక్రాంతి కి “నా సామిరంగా”(Naa Saami Ranga) అంటూ వస్తున్నాడు. “పొరింజు మంజుం జోస్” అనే మళయాళం చిత్రం రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేట్లు మార్చుకున్నారు. కీరవాణి సంగీతం హైలైట్ అవుతుందో లేదో చూడాలి. కొరియోగ్రఫర్ నుంచి దర్శకుడు గా ప్రమోషన్ పొందిన విజయ్ బిన్నీ కి ఇది పరీక్షా సమయం .

Sankranti Movies 2024: అంచనాలు

ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం మహేష్ బాబు గుంటూరు కారం మాస్ కి , హనుమాన్ ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఛాయస్ అవ్వవచ్చు..

See also  Sankranti Box Office Report: సంక్రాంతి సినిమాల వారాంతపు వసూళ్లు.. విన్నర్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి

ఇక Sankranti Movies 2024 చిత్రాల్లో ఏది సంక్రాంతి పందెం కోడి అవుతుందో త్వరలోనే తెలిసిపోతుంది

సి.యస్.రాంబాబు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top