
అప్పుడెప్పుడో 2011లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే బహిరంగంగా న్యూడ్‌గా తిరుగుతానంటూ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తో పూనమ్ పాండే(Poonam Pandey) ఓవర్ నైట్ స్టార్ అయిన సంగతి తెల్సిందే. అసలు ఎవరీ పిచ్చి బ్యూటీ అంటూ గూగుల్‌లో తెగ వెతికారు. ఇప్పుడు కట్ చేస్తే 2024లో అంటే 13 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌తో పూనమ్ మృతి చెందిందని వార్తలు రావడంతో, మళ్లీ అదే రేంజ్‌లో పూనమ్ ట్రెండ్ అవుతుంది. ఈ ఒక్క న్యూస్ దెబ్బకి నిన్నటి నుంచీ ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది పూనమ్ పాండే. కానీ ఇప్పుడు ఆమె మృతి నిజం కాదా ? అసలేమైంది? అనే ప్రశ్నలు చాలా వస్తున్నాయి.
పూనమ్ పాండే(Poonam Pandey) సర్వైకల్ క్యాన్సర్‌తో పోరాడి శుక్రవారం మరణించినట్లు ఆమె మీడియా మేనేజర్ పరుల్ చావ్లా ప్రముఖ హిందీ న్యూస్ ఛానల్ మొదటిగా తెలిపారు. ఆ కాసేపటికే ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ ద్వారా పూనమ్ పాండే చనిపోయింది అని కన్ఫర్మేషన్ ఇచ్చారు.
అయితే ఈ వార్త తెలిసిన సోషల్ మీడియా ఊరుకుంటుందా.. వెంటనే చాలా మంది నిజమే అనుకుంటూ ‘రెస్ట్ ఇన్ పీస్ పూనమ్’ అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా లో ఏది చూసిన నమ్మే బ్యాచ్ వున్నట్లే, ఇంకొంత మంది నెటిజన్లు మాత్రం ఇది అసలు నిజమేనా అంటూ సిఐడీ లెవల్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అదే అయ్యింది, నిన్నటి వరకూ చాలా ఆనందంగా కనిపించిన పూనమ్ సడెన్‌గా ఎలా చనిపోయిందంటూ పోస్టులు పెట్టారు ఇన్వెస్టిగేటివ్ బ్యాచ్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయిందేమో అని కూడా కామెంట్స్ చేసారు. ఇక మరో విషయమేంటంటే సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు ఇంత ఆకస్మికంగా చనిపోరని, ఒక వేళ నిజంగా చనిపోతే దీనిపై దర్యాప్తు చేయాల్సిందేనంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
Shocking Twist on Poonam Pandey’s Death
ఇక సోషల్ మీడియాలో కన్‌ఫ్యూజన్ మొదలైంది. అయితే దీనిపై పెద్ద పెద్ద మీడియా హౌస్‌లు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే గత మూడు రోజులుగా పూనమ్ పాండే ఎక్కడుంది? అనేది ఎవ్వరికీ తెలియదు. ఆమె చనిపోయి ఉంటే ఆమె డేడ్ బాడీ ఎక్కడుంది? అనే వివరాలు కూడా ఎవరూ చెప్పలేదు. అలానే ఆమె ఫ్యామిలీ కూడా ఇప్పటివరకూ బయటికి రాలేదు అనే డౌట్స్ వచ్చాయి.
ఇక మరి కొంతమంది అయితే ఇదో పెద్ద స్టంట్, డ్రామా అంటూ చెప్పుకొస్తున్నారు. దానికి బలమైన కారణం కూడా వుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతూ 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుపెడతామని చెప్పుకొచ్చారు.
సో ఈ సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన వచ్చేందుకే ఈ డ్రామా ఆడిందని.. రేపో మాపో బయటికి వస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. మూడు రోజుల క్రితం వరకూ యాక్టివ్ గా ఉన్న పూనమ్ పాండే (Poonam Pandey) ఇలా సడెన్‌గా ఎలా చనిపోతుందనేది కూడా పాయింటే మరి! ఏది ఏమైనా మరణంపై ఇలా డ్రామాలు ఆడటం మాత్రం మంచి పద్ధతి కాదు అంటూ కొంతమంది తిట్టి పోస్తున్నారు.. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించిన తరువాత ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే వారు ఎక్కువ అయ్యారు.. మరి ఇది నిజామా పూనమ్ బతికే ఉందా? అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
-By Pranav @ samacharnow.in