Sivaraj Kumar: శివరాజ్ కుమార్ తో సప్త సాగరాలు దాటి డైరెక్టర్ కొత్త మూవీ?

Sivaraj Kumar: "సప్త సాగరాలు దాటి" మూవీ దర్శకుడు అయిన హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ మూవీ ప్రముఖ హీరో శివ రాజ్ కుమార్ తో చేస్తున్నారని తెలుస్తుంది.
Share the news
Sivaraj Kumar: శివరాజ్ కుమార్ తో సప్త సాగరాలు దాటి డైరెక్టర్ కొత్త మూవీ?

కన్నడ మూవీ ఇండస్ట్రీ వైపు చూపు తిప్పుకునేలా చేసిన సినిమాలు కే.జి.యఫ్ & కాంతారా… ప్రపంచవ్యాప్తంగా కే.జి.యఫ్ 1200 కోట్లు, అలాగే కాంతారా 400 కోట్లు వసూలు చేయడంతో అంతా షాక్ అయ్యారు.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన చార్లీ 777 తో మంచి హిట్ దక్కించుకున్న రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బీ సినిమాలతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ అందుకున్నాడు. ఈ సినిమాలు కన్నడలో మంచి హిట్ అయినప్పటికీ తెలుగులో అంతగా ఆడలేదు.. సైడ్ ఏ పరవాలేదనిపించుకున్నా సైడ్ బి తేలిపోయింది అనే చెప్పాలి. సింగిల్ పాయింట్ తో సాగే సప్త సాగరాలు దాటి సైడ్ బి ఎంగేజింగ్ గా ఉన్నా బోర్ కొడుతుంది.

Sivaraj Kumar కొత్త మూవీ

ఇక అసలు విషయానికి వస్తే ఆ సప్త సాగరాలు దాటి సినిమా దర్శకుడు అయిన హేమంత్ ఎం రావు(Hemanth M Rao) తన నెక్స్ట్ మూవీ ప్రముఖ హీరో శివ రాజ్ కుమార్(Sivaraj Kumar) తో చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని స‌మాచారం. జె.ఫిల్మ్స్ బ్యానర్ లో వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

See also  HanuMan BO Collections: హనుమాన్ కలెక్షన్ల కుంభవృష్టి..15 రోజుల్లో 250 కోట్ల గ్రాస్!

కవలుదారి, భీమ సేన నల మహారాజు, సప్త సాగరాలు దాటి లాంటి డిఫరెంట్ జాన‌ర్‌లు త‌ర్వాత హేమంత్ ఎం రావు యాక్ష‌న్ సినిమా చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మూవీ టీం తెలిపింది.

తాను నిర్మిస్తున్న మొదటి సినిమానే శివరాజ్ కుమార్(Sivaraj Kumar) లాంటి స్టార్ట్ తో చేయడం సంతోషంగా ఉందని. ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచిందని నిర్మాత వైశాక్ ఏ గౌడ తెలిపారు. శివన్న ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

గత ఏడాది జైలర్‌లో చేసిన గెస్ట్ రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే కెప్టెన్ మిల్లర్ సినిమాలో తన క్యారెక్టర్ కి ఒక పాటలో లో తను చేసే డాన్స్ అదిరిపోయింది. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రానికి కూడా శివన్న డేట్స్ ఇచ్చారు అని సమాచారం.

See also  Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి..

-By Pranav @ samacharnow.in

Also Read News

Scroll to Top