
మన తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లకి భలే డిమాండ్ ఉంటుంది. అందులోనూ హీరో లేదా హీరోయిన్స్(Heroines) లాంటి పాత్రల్లో నటిస్తే ఆ ఫెమ్ ఎన్నిరోజులు అయినా పోదు… ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే ఎన్ని సంవత్సరాలు అయినా ఆ క్యారక్టర్ చేసిన అమ్మాయి లేదా అబ్బాయి ఫోటోలు ఇప్పటికీ నేట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర సినిమాలో నటించిన తేజా సజ్జా రీసెంట్ గా హనుమాన్ తో ఏ రేంజ్ హిట్ సాధించాడో మనందరం చూసాము.. ఇంకా కొంతమంది అయితే ఇంద్ర సినిమా నిన్నే రిలీజ్ అయినట్టు అనిపించింది అప్పుడే తేజా హీరో అయ్యాడు అంటే నమ్మలేకపోతున్నాం అని కామెంట్స్ కూడా చేసారు. మన జీవితంలో కూడా మన కళ్ళముందు పుట్టిన పిల్లలు టకటకా పెరిగిపోతూ ఉంటే ఆశ్చర్యానికి గురైన సందర్బాలు ఎన్నో… మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు.



టీనేజ్ వయసు లోనే Heroines గా
ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతి శెట్టి కి కూడా కేవలం 20 సంవత్సరాలు అని తెలిసి మనమంతా షాక్ అయ్యాము వరుస హిట్ లతో మంచి ఫాం లో ఉన్న శ్రీలీలకు కూడా 22 సంవత్సరాలు అని తెలిసి నోరు వేల్లబెట్టాము… అయితే రీసెంట్ గా ఒక వార్త నేట్టింట్లో వైరల్ అవుతుంది.
రీసెంట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ సినిమాలో జెన్ని పాత్రలో నటించిన అనంతిక సనీల్ కుమార్ తన క్యూట్ పేస్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన ఏజ్ కి సంబంధించి ఒక విషయం బయట పెట్టింది అనంతిక. ఆ ఇంటర్వ్యూ లో తను కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అని, తనకు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే అని చెప్పుకొచ్చింది.
ఈ వార్త చూసిన మీమర్స్ , నెటిజన్లు బాగా ట్రోల్స్ చేస్తున్నారు… ఇన్నిరోజులు నేను చిన్న పిల్లని క్రష్ లా అనుకుని.. కలలో మ్యారేజ్ వరకు వెళ్ళిపోయానా.. అయినా పర్లేదులే అమ్మాయి బాగుంది అదే చాలు అని బ్రహ్మానందం ఫోటో యాడ్ చేసి పెట్టడం లాంటివి చేస్తున్నారు… మరొకవైపు ఇంత చిన్న ఏజ్ లోనే హీరోయిన్స్(Heroines) అవ్వడమంటే మామూలు విషయం కాదు, అంటూ మరికొంతమంది మెచ్చుకుంటున్నారు…


-By Pranav @ samacharnow.in