
Top 10 Most Viewed South Indian Actors in 2024
వికీపీడియాలో Most Viewed టాప్ 10 దక్షిణ భారత నటులు – జనవరి 2024 లిస్టు లో ఆ యువ హీరో పేరు..! తస్సాదియ్యా ప్రభాస్ ని దాటేసాడుగా..
సాధారణంగా యువ హీరోలు తెలుగు ఇండస్ట్రీ లో ఒక లెవల్ కి రావడం అంటే చాలా కష్టం. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కొన్ని సార్లు బోల్తా పడిన చాలామందిని చూసాం… అయితే ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ప్రస్తుతం ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసాడు ఈ యువ హీరో… ఏకంగా టాప్ 10 Most Viewed సౌత్ ఇండియన్ యాక్టర్స్ 2024 లిస్టు లో మొదటి స్పాట్ సాధించుకున్నాడు అంటే మామూలు విషయమా?
అవును. ఈ సంక్రాంతికి విడుదలై వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హనుమాన్ సినిమాలో నటించిన తేజా సజ్జా(Teja Sajja) టాప్ 10 Most Viewed సౌత్ ఇండియన్ యాక్టర్స్ 2024 లిస్టు లో మొదటి స్పాట్ లో ఉన్నాడు. ఎవరైనా కొంచం వైరల్ అయితే చాలు ఇంటర్నెట్ లో హడావుడి ఎలా ఉంటుందో తెలిసిందే… నెట్టింట్లో ఎప్పటికప్పుడు ఫ్యాన్ వార్స్, కంపారిజన్స్ మూములే అయితే అలాగే కంపేర్ చేస్తూ ఒక అకౌంట్ నించి ట్విట్టర్ లో పెట్టిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రభాస్ ని కూడా దాటేయడంతో ఇంకా వైరల్ గా మారింది ఆ ట్వీట్. ఆ పోస్ట్ ప్రకారం చూస్తె మొదటి స్థానంలో తేజా సజ్జా, రెండవ స్థానంలో ప్రభాస్(Prabhas), మూడవ స్థానంలో, మహేష్ బాబు(Mahesh Babu), తర్వాత విజయ్, కమల్ హాసన్, నాని, పృథ్వీరాజ్ సుకుమారాన్, మమ్ముట్టీ, ధనుష్, చిరంజీవి(Chiranjeevi) లు ఉన్నారు.
చైల్డ్ ఆర్టిస్టుగా చిరంజీవి “ఇంద్రా” సినిమాలో, మహేష్ బాబు తో “రాజకుమారుడు” సినిమాల్లో నటించి ఇప్పుడు వాళ్లనే దాటేసాడు అని కామెంట్స్ పెడుతున్నారు… మరి తన ఫేట్ మార్చేసిన హనుమాన్ సినిమా తేజా కి ఇంకెన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందో చూడాలి…
ఈ ఆర్టికల్ కి సోర్స్ కింద ఇవ్వబడింది.
-By Pranav @ samacharnow.in
