Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక!

Share the news
Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక!

కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిరంజీవి(Chiranjeevi) కి ,వెంకయ్య నాయుడు (Venkaiah Naidu)కి పద్మ విభూషణ అవార్డు వచ్చిన సంగతి తెల్సిందేదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌(Padma Vibhushan) అవార్డుకు వారు ఎన్నికవ్వడం పట్ల తెలుగు వారు ఎంతో సంతోష పడుతున్నారు .

Padma Vibhushan winners in Single Frame

ఇదిలా ఉంటే అభినందించడం లో ఎప్పుడు ముందుండే చిరంజీవి తాజాగా వెంకయ్య నాయుడుని స్వయంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు పద్మవిభూషణులు ఒకరికి ఒకరు పరస్పర ఆత్మీయ అభినందనలు తెలుపుకున్నారు. ఇద్దరు పద్మవిభూషణులను ఒకే ఫ్రేంలో చూడటం తెలుగు వారికి కనుల పండుగ లా వుంది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, జై ఆంధ్ర ఉద్యమం సమయంలో తాను కాలేజీలో చదువుతున్నానని, అప్పట్లో విద్యార్థి నేతగా ఉన్న వెంకయ్య నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు తాము కూడా తరగతులను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నామని తెలిపారు. అప్పటి నుంచీ వెంకయ్య గారు తనకు తెలుసని నాటి కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మేమిద్దరం పార్లమెంట్‌లో కొంతకాలం కొలీగ్స్‌గా ఉన్నాం. వెంకయ్య నాయుడు గారు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయనతోపాటు నాకు కూడా పద్మవిభూషణ్‌(Padma Vibhushan) లభించటం నా సంతోషాన్ని ద్విగుణీకృతం చేసింది. ఇద్దరికి ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్‌ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం’ అని చిరంజీవి చెప్పారు.

See also  Varun Tej in Operation Valentine Promotions: పెద్దల మాటకి కట్టుబడి ఉంటా - వరుణ్ తేజ్ స్టేట్మెంట్ వైరల్!

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లయితే.. చిరంజీవి ‘త్రినేత్రుడు’: వెంకయ్య నాయుడు
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. “నేను ఎప్పుడూ అంటుంటాను. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు రెండు నేత్రాలు అయితే చిరంజీవి మూడో నేత్రం. ఆయన త్రినేత్రుడు. చిరంజీవి గారు పద్మ విభూషణ్(Padma Vibhushan) పురస్కారానికి పూర్తిగా అర్హులు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. సరైన సమయంలో భారత ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం ఇచ్చింది. చిరంజీవి గారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది” అని అన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top