Varun Tej Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం నుండి మొదటి సింగిల్ వందేమాతరం..

Share the news
Varun Tej Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం నుండి మొదటి సింగిల్ వందేమాతరం..

Varun Tej Operation Valentine నుండి మొదటి సింగిల్

షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) చిత్రం నుండి మొదటి సింగిల్ వందేమాతరం ను అమృత్‌సర్‌లోని వాఘా బోర్డర్‌లో మేకర్స్ విడుదల చేసారు, ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. రిపబ్లిక్ డే వారంలో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కూడా పాల్గొన్నారు. సోనీ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నఈ సినిమాకి శక్తి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయవలసి వుంది కానీ విడుదల తేదీ మార్చుకున్నారు. ఇక ఇప్పుడు సినిమా విడుదల డేట్ దగ్గర పడుతున్న క్రమంలో వరుస అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

రిజల్ట్ సంగతి పక్కన పెడితే మాత్రం వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త కథను ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. నటుడిగా కూడా ప్రతి సినిమాలో కొత్త తరహా కోణాన్ని బయటపెడుతూ ఉన్నాడు. ఇక ఈసారి అతను ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో మరొక వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక సినిమాలోని హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే వందేమాతరం అనే పాటను ఈ రోజు విడుదల చేశారు. చూడరా సంగ్రామ సూరుడు.. అంటూ సాగే ఈ పాటలో హీరో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. చావునే చెండాడు ధీరుడు.. నిప్పులు కురిశాడు.. అనే లైన్స్ తో ఈ పాట సినిమాలో గూస్ బంప్స్ తెచ్చేలా వుందిమిక్కీ జె మేయర్ స్వర కల్పనలో వచ్చిన ఈ పాటను కునల్ కుండు పాడగా రామజోగయ్య శాస్ట్రీ లిరిక్స్ అందించారు. ఇక మేకింగ్ విజువల్స్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ చేస్తున్న మొట్ట మొదటి సినిమా ఇదే. హీరో క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది పాటను చూస్తే.

See also  Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

గత ఏడాది పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ ఫ్యామిలీ లైఫ్ కోసం ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను హిందీ, తెలుగులో ఒకేసారి విడుదల కానున్న యాక్షన్ డ్రామా, ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా మానుషి చిల్లర్ నటిస్తోంది. ఎయిర్ ఫోర్స్ హీరోల అలుపెరగని పోరాటాన్ని ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఇక సినిమా ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలోకి రాబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top