Vishwambhara Shooting Updates: చిరంజీవి-వశిష్టల ‘విశ్వంభర’ చిత్ర షూటింగ్ లో చేరిన త్రిష

Share the news
Vishwambhara Shooting Updates: చిరంజీవి-వశిష్టల ‘విశ్వంభర’ చిత్ర షూటింగ్ లో చేరిన త్రిష

Vishwambhara Shooting Updates

చిరంజీవి(Chiranjeevi) మరియు వశిష్ట మల్లిడి(Vasishta) కాంబినేషన్ లో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెల్సిందే. చిరంజీవి ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన తర్వాత, అయన మరో అద్భుతమైన అప్‌డేట్‌(Vishwambhara Shooting update)ను తెలుగు సినీ అభిమానులతో పంచుకున్నారు.

విశ్వంభర సెట్‌లో చేరిన త్రిషకు సాదర స్వాగతం పలికిన ఫోటోను ప్రముఖ నటుడు చిరంజీవి పోస్ట్ చేశారు. స్టాలిన్ సినిమా తర్వాత అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరుతో ఆమె మళ్లీ కలసి నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఇది అంచనాలను మరింత పెంచింది. ఆమె రాక పట్ల టీమ్ మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుత షెడ్యూల్ లో చిరు మరియు త్రిష కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించ బోతున్నారని తెలుస్తుంది.

UV క్రియేషన్స్ నిర్మిస్తున్న విశ్వంభర కు సంగీతం ఎవరో కాదు, ఆస్కార్-విజేత స్వరకర్త MM కీరవాణి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం జనవరి 10, 2025న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేయబడింది. గ్రాండ్ సినిమాటిక్ ఎక్సపీరియన్సు కోసం టీమ్ సన్నద్ధమవుతున్నందున అంచనాలు పెరుగుతున్నాయి.

See also  Padma Awardees 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top