Waltair Veerayya Poonakalu Loading: వాల్తేరు వీరయ్య అరుదైన రికార్డు.. అవనిగడ్డ లో ..365 రోజులు.. రోజు 4 షోలు

Share the news
Waltair Veerayya Poonakalu Loading: వాల్తేరు వీరయ్య అరుదైన రికార్డు.. అవనిగడ్డ లో ..365 రోజులు..  రోజు 4 షోలు

Waltair Veerayya: అరుదైన ఘనత

చిరంజీవి(Chiranjeevi) అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి తరం హీరోలకు, పాన్‌ ఇండియా హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం సినిమాలు థియేటర్లోకి ఇలా వచ్చి అలా వెళుతున్నాయి. మహా అయితే 4 వారాలు అంతే. రిలీజైన 4 వారాలకే Big Screenపై సందడి కనిపించడం లేదు. అలాంటిది చిరు సినిమా ఏకంగా ఏడాది పూర్తి చేసుకుంది. అది కూడా రోజుకు నాలుగు షోలతో ఒక థియేటర్లో 365 రోజుల పాటు ఆడి రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే గతేడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya). 2023లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా చిరంజీవి సినిమాల్లోనే అత్యధికంగా.. 236 కోట్లకు పైగా వసూల్ చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు తాజాగా మరో ఘనత సాధించడం విశేషం.

Waltair Veerayya: చిరంజీవి ఆడియో నోట్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అవనిగడ్డ రామకృష్ణ థియేటర్‌లో ఈ సినిమా 365 రోజుల నుంచి 4 షోలు ఆడుతోంది. ఈ ప్రత్యేక సందర్భంగా చిరంజీవి అభిమానులు ఒక ప్రత్యేక వేడుక నిర్వహించి దర్శకుడు బాబి కొల్లి, నిర్మాత రవిశంకర్ లను సన్మానించడం విశేషం. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆడియో నోట్‌ని విడుదల చేశారు.”అభిమానులందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. 2023 సంక్రాంతి నుండి 2024 సంక్రాంతి వరకు.. ఒక సంవత్సరం పాటు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్‌లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఆడుతూనే ఉందంటే, మీకు నాపై ఉన్న ప్రేమ, అభిమానం ఎలాంటిదో తెలుస్తున్నాయి. మీ ప్రేమ, అప్యాయతలకు ధన్యుడిని. ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్. ఈ రికార్డ్‌కి కారణం మీకు నచ్చేలా, మీరు మెచ్చేలా.. ఈ చిత్రాన్ని మలిచిన డైరెక్టర్ బాబీ(Boby Kolli), అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. అలాగే నా తమ్ముడు రవితేజతో(Ravi Teja) పాటు.. ఈ చిత్రంలో ఉన్న ఇతర తారాగణం. వీళ్లందరినీ దండలా ఏర్చి కూర్చి పేర్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అందరి సమిష్టి కృషి ‘వాల్తేరు వీరయ్య’.

See also  Anupama Parameswaran: అసలు మీరు సినిమాని చూసారా అంటూ గుల్టెకి గట్టిగా ఇచ్చిన అనుపమ..

సాధారణంగా థియేటర్లో రిలీజైన నాలుగు వారాలకే సినిమాకు తెరపడుతున్న పరిస్థితుల్లో చిరంజీవి సినిమా ఏకంగా ఏడాది పొడవునా థియేటర్లో ఆడటం.. అది కూడా రోజుకు నాలుగు షోలతో అంటే అది రికార్డే అని చెప్పాలి. అలాంటి అరుదైన ఘనతను చిరు తాజాగా తన ఖాతాలో వేసుకోసం విశేషం. దీంతో చిరంజీవి ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top