
రామ్ చరణ్ ఫిర్యాదుపై స్పందించిన Anand Mahindra!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య ట్విట్టర్ వేదికగా ఒక సరదా సంభాషణ జరిగింది. అది ఇప్పుడు వైరల్ అయింది. వివిధ సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో చురుకుగా వుండే ఆనంద్ మహీంద్రా ఇటీవల రామ్ చరణ్ “సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు” అని సరదాగా ప్రశ్నించినప్పుడు, తాను కూడా సరదాగా ప్రతిస్పందించారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోపై రామ్ చరణ్ వ్యాఖ్యానించడంతో ఈ సంభాషణ మొదలైంది, సుజిత్ అనే వ్యక్తికి పెళ్లికి ఆహ్వానం అందకపోవడం పట్ల రామ్ చరణ్ తన ‘ఆశ్చర్యం’ వ్యక్తం చేస్తూ “నన్ను సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు, @anandmahindra? నేను జహీరాబాద్‌కి దగ్గర్లోనే ఉంటాను. జహీరాబాద్‌లో నా స్నేహితులను కలవడం సరదాగా ఉండేది” అని సరదాగా అన్నారు. దానితో పాటు వీడియోలో చూపిన దాని గురించి “గొప్ప పని, @MahindraRise.” అని అన్నారు
దీనిపై ఆనంద్ మహీంద్రా అంతే సరదాగా స్పందించారు. “నేను గందరగోళానికి గురయ్యాను. మీకు ఆహ్వానం పంపడం మిస్ అయ్యాను! మీరు నేర్పిన నృత్య భంగిమలను చేయడంలో నిమగ్నమై ఉన్నానని. నేను గందరగోళానికి గురికాకుండా & మళ్లీ మిస్ కాకుండా ఉండడానికి ఇక్కడ మీకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని అన్నారు
I confess.
— anand mahindra (@anandmahindra) March 23, 2024
I messed up.
And missed sending you the invitation @AlwaysRamCharan !
I believe I was preoccupied with perfecting my dance moves based on your last lesson. 😅
But, many thanks for the shout-out! Makes a huge positive impact.
Let me not mess up & miss out… https://t.co/MBl55Eg47Q