Sankranti: మన తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం రండి..

Sankranti: మొత్తం సిటీని రైళ్లల్లో, బస్సుల్లో, కార్లల్లో.. అసలు ఏది దొరికితే దానితో పల్లెకు ప్రయాణం కట్టించే పండుగంటే సంక్రాంతే. మన తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం రండి..
Share the news

సంక్రాతి.. మన తెలుగు వారికి అతి పెద్ద పండుగ.
సంక్రాంతి ముగ్గులు. ముగ్గుల్లో గొబ్బిమ్మలు. కొత్త పరికిణీలతో ఆడపిల్లల హడావిడి.

బోగి మంటలు.. బోగి పళ్ళు.. బొమ్మల కొలువు..
పొద్దున్నే చలి మంటలు..బుడబుక్కల వాడి సందడి.. హరిదాసు పాటలు
.. ఆ తరువాత గంగిరెద్దులవాడు.
పండక్కి కొత్త అల్లుళ్ళ సందడి.. పిండి వంటలు, కక్క, ముక్క..
ఇక కోడి పందాలు.. పతంగులు పోటీలు మామూలుగా ఉండవు
మొత్తం సిటీని రైళ్లల్లో, బస్సుల్లో, కార్లల్లో.. అసలు ఏది దొరికితే దానితో పల్లెకు ప్రయాణం కట్టించే పండుగంటే సంక్రాంతే

అసలు సంక్రాంతి పండగ ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం రండి..

Sankranti: మన తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం రండి..

మకర సంక్రాంతి(Makara Sankranti)

సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించేటప్పుడు సంక్రాంతి(Sankranti) పండుగను జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు పాటు అనగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడం మన సాంప్రదాయం. ఈ రోజుల్లో హరిదాసు పాటలు, గంగిరెద్దుల కోలాటం, గాలిపటాలు ఎగురవేయడం, రంగు రంగు ముగ్గులను వేసి అందులో గొబ్బెమ్మలను పెడుతూ ఎంతో ఆనందంగా తెలుగుదనం ఉట్టిపడేలా ఈ పండుగను జరుపుకుంటారు.

See also  Bhogi Celebrations: భోగి వేడుకల్లో సీఎం జగన్, మాజీ సీఎం బాబు మరియు పవన్ కళ్యాణ్

భోగి (Bhogi)

భోగి అనే పధం “భుగ్” అనే సంస్కృత పధం నుంచి వచ్చింది. “భుగ్” అంటే సుఖం అని అర్ధం. పూర్వం భోగి పండుగ రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారి అనుగ్రహాన్ని పొందింది. కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అని అంటారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది.
భోగి రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి భోగిమంటలు వేస్తారు. దక్షిణాయమ్ లో ప్రజలు తాము పడిన కష్టాలు అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. ధనుర్మాసం నెల అంతా ఇంటి ముంధు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి ఈ భోగి మంటల్లో వేస్తారు. ఇలా భోగి మంటల్లో ఆవు పిడకలి వేసి ఆ గాలిని పీల్చడం ద్వారా సూక్ష్మక్రిములు నశించి గాలి శుద్ధి అయ్యి మనకు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంధి.
భోగి రోజు మన ఇంట్లో చిన్న పిల్లలపై భోగి పళ్ళు వేయటం ద్వారా వారికి బాలారిష్టాలు, గ్రహ పీడలు తొలగి పోయి ఎంతో ఆరోగ్యకరమైన జీవితం పొందుతారని భావిస్తారు

See also  Maghamasam: మాఘమాసం ఎప్పుడొస్తుందో?.. వచ్చేసింది.. మాఘమాసం విశిష్టత తెలుసుకుందామా!

సంక్రాంతి(Sankranti)

సంక్రాంతి(Sankranti) అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి (Sankranti) అంటారు. పురాణాల ప్రకారం, మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భువిపైకి తీసుకొస్తాడు. ఈరోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భువిపైకి వస్తుంది. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మరియు ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు.

కనుమ(Kanuma)

కనుమ పండుగను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశువులను ఈ కనుమ పండుగ నాడు పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజే ఈ కనుమ. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. కనుమ నాడు పితృ దేవతలకు ప్రసాదాన్ని పెట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి భుజించి, అందరూ కలిసి ఒకే చోట ఉండి పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా కనుమనాడు గారెలతో పెద్దలకు నైవేద్యం పెడతారు. అలాగే ప్రయాణాలు, శుభకార్యాలు చేయడం కనుమనాడు నిషేధం. ఆరోజు ఆయా కుటుంబాలలో గతించిన పెద్దలకు కేటాయించి వారి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మనం నడుచుకోవాలి

See also  Ugadi: తెలుగు సంవత్సరాల వెనక పురాణ కథనం.. నూతన క్రోధి నామ సంవత్సరం రాశిఫలాలు ఏమిటి?

వ్యాస కర్త:

పంతులుగారు భీష్మ కుమార్ శర్మ
9030243911

Also Read News

Scroll to Top