
Agniveervayu 2025: న్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
Agniveervayu 2025: అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అగ్నివీర్ వాయు ఇంటెక్ (01/2025) ఖాళీల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత గల అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఫిబ్రవరి 6 లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు : Click here
ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ వ్రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన మొదలైన వాటి ఆధారంగా నిర్వహించబడుతుంది. నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాలి. ఎంపిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి, అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏవైనా సందేహాల కోసం సికింద్రాబాద్-12 ఎయిర్‌మెన్ ఎంపిక కేంద్రాన్ని 040-27753500 లేదా ఇమెయిల్: co.12asc-ap@gov.inలో సంప్రదించవచ్చు.