
AP EAPCET 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సు్ల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన AP EAPCET 2024 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడింది. దరఖాస్తులు 12/03 నుంచి మొదలైయ్యాయి. దీనిద్వారా 2024 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హులైన అభ్యర్థులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 13 నుండి 19 వరకు ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) పరీక్షలు నిర్వహిస్తారు. జేఎన్‌టీయూ కాకినాడ(JNTUK ) పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ కె.వెంటక రెడ్డి ఏపీఈఏపీసెట్ 2024 కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
Important Dates
Online Application Process Start: 12.03.2024.
Last Date for Online Application: 15.04.2024.
AP EAPSET Exam Dates: May 13 to 19.