
AP EAPCET 2024 Dates Changed
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో మే, జూన్ నెలల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి రీషెడ్యూల్ చేసింది. ఇందులో ముఖ్యంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు మారాయి(AP EAPCET 2024 Dates Changed). మొదట నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం మే 13 నుంచి 19 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఇప్పుడు అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో.. ఇంజినీరింగ్ విభాగానికి మే 18 – 22 వరకు పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
అదేవిధంగా, ఏపీ పీజీసెట్(AP PGCET 2024) పరీక్ష జూన్ 3 నుంచి 7 వరకు జరగాల్సి ఉండగా.. వాటిని జూన్ 10 – 14 మధ్య నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇక ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌కు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆర్‌సెట్(AP RCET 2024) పరీక్షలను మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ వెల్లడించారు. ఈ మేరకు మార్చి 20న అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే TS EAPCET 2024 కూడా రీషెడ్యూలు చేస్తారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం TS EAPCET 2024 మే 9 నుంచి 12 వరకు జరగ నుంది. మే 13 న సార్వత్రిక ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఇవి కూడా మార్చే అవకాశం ఉంది.
