![AP TET 2024: AP ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల, 8th Feb. నుండి దరఖాస్తులు](https://samacharnow.in/wp-content/uploads/2024/02/AP-TET-2024-1.png)
AP TET 2024
AP TET 2024 నోటిఫికేషన్: ఏపీలో టీచర్ల పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7న ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 6100 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీతోపాటు టెట్ నోటిఫికేషన్ వివరాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. TET దరఖాస్తు ప్రక్రియ (AP TET 2024) ఫిబ్రవరి 8 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఫీజు చెల్లింపు కోసం ఫిబ్రవరి 17 నిర్ణయించబడింది. అభ్యర్థులు ఫిబ్రవరి 19న మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు.
Also See: AP DSC Notification 2024
టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నిర్వహించబడతాయి. ఆ రోజుల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 10న టెట్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. ఆన్సర్ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. ఆ తర్వాత మార్చి 13న టెట్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. మార్చి 14న టెట్ తుది ఫలితాలు.. DSC లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.