
APPSC Group 1 Prelims Exams హాల్ టిక్కెట్లు విడుదల
APPSC Group 1 Prelims Exams హాల్ టిక్కెట్లు: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. APPSC మార్చి 10న హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మార్చి 17న జరుగుతుందని.. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. . అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదవాలని కమిషన్ కార్యదర్శి తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే సరిచూసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణీత సమయానికి పరీక్షకు హాజరుకావచ్చని ఆయన సూచించారు.