
APPSC Group 2 Answer Key Released
APPSC Group2 Answer Key: ఏపీలో ‘గ్రూప్ -2’ పోస్టుల భర్తీకి ఈ నెల 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. APPSC అధికారిక వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రంతోపాటు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు తెలియజేయవచ్చు. పోస్టు/వాట్సప్/ఎస్‌ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో మాత్రమే అభ్యంతరాలు సమర్పించాలని ఏపీపీఎస్సీ సూచించింది.