APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు!

APPSC Group1: ఏపీలో 'గ్రూప్‌-1' పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జనవరి 28 వరకు పొడిగించిన APPSC. అభ్యర్థులు జనవరి 28 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
Share the news
APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు!

APPSC Group1 దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు

ఏపీలో ‘గ్రూప్‌-1’ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది. దరఖాస్తు గడువు జనవరి 21తో ముగిసినప్పటికీ.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్లు ఏపీపీఎస్సీ జనవరి 23న ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు జనవరి 28న అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని కమిషన్ తెలిపింది. అయితే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న ప్రిలిమినరీ (స్క్రీనింగ్) పరీక్ష నిర్వహించనున్నారు.

APPSC Group1 పూర్తి వివరాల కొరకు : Click here

ఏపీలో 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పొడిగించిన తేదీ ప్రకారం అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించనున్నారు.

See also  AP DSC 2024: 6100 SA, SGT, ప్రిన్సిపల్, PGT, TGT, PD ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

Also Read News

Scroll to Top