
APPSC Group2 Hall Tickets Released
ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను(APPSC Group2 Hall Tickets) ఫిబ్రవరి 14న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ OTPR ID మరియు పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్క్రీనింగ్ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని APPSC అభ్యర్థించింది.
APPSC Group 2 hall tickets కొరకు: Click Here
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-II పోస్టుల కోసం మొత్తం 899 ఖాళీలలో, 53 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరియు 846 తాజా ఖాళీలు. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్ (ఎగ్జిక్యూటివ్) మరియు 566 నాన్ ఎగ్జిక్యూటివ్ (నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టులు ఉన్నాయి.
