
APPSC Junior Lectures Recruitment
ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల (JL) పోస్టుల భర్తీకి APPSC డిసెంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా ఆనర్స్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వ్రాత పరీక్ష మరియు కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది.