
DME Assistant Professors Recruitment
APలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు టీచింగ్ హాస్పిటల్స్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 255 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుండి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మొదలైన వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపిక జరుగుతుంది.