
ఒకేరోజు APPGroup-2 and SBI Clerk Exams issue: సమస్యను పరిష్కరించిన SBI
ఏపీలో ఒకేరోజు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష, SBI Junior Associate మెయిన్స్ పరీక్ష ఒకే రోజు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే వీరికి ఇప్పుడు స్టేట్‌బ్యాంక్ ఇండియా శుభవార్త తెలిపింది.
రెండు పరీక్షలు ఒకేరోజు వుండటంతో పరీక్ష తేదీ మార్చాలంటూ APPSC రాసిన లేఖపై ఎస్‌బీఐ స్పందించింది. ఫిబ్రవరి 25న గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4న SBI Junior Associate మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో గ్రూప్-2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుందని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు సుధీర్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. So Group-2 and SBI Clerk Exams issue solved
అయితే, మార్చి 4న ఎస్‌బీఐ మెయిన్స్ పరీక్ష రాయాలనుకొనే అభ్యర్థులు ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటల లోపు సంబంధిత లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని SBI స్పష్టం చేసింది. కనుక అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
APPSC Group-2 పరీక్షకు హాజరయ్యేవారు SBI Junior Associate పరీక్ష తేదీ మార్చుకునేందుకు క్లిక్ చేయండి
— Parige Sudhir (@ParigeSudhir) February 21, 2024