
Indian Army Jobs
ఇండియన్ ఆర్మీ 63వ మరియు 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 381 ఖాళీలను భర్తీ చేస్తారు. అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సాంకేతిక కోర్సులకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్ టెక్నికల్ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సు అక్టోబర్ 2024లో ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 23 నుంచి ప్రారంభం కాగా ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.రెండు దశల రాత పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Indian Army Jobs: పోస్ట్ మరియు ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 381.
63వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు: 350 పోస్టులు
ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లు.
34వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 29 పోస్టులు
ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
SSC W (టెక్నికల్): 1 పోస్ట్
SSC W (నాన్-టెక్నికల్): 1 పోస్ట్
అర్హత
సాంకేతిక విభాగాలకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ విభాగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.
వయో పరిమితి
01.10.2024 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్
రూ.56,100- రూ.1,77,500.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 రాత పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
Indian Army Jobs: ముఖ్యమైన లింకులు
అధికారిక వెబ్‌సైట్: Click here
నోటిఫికేషన్ కొరకు: Click here
నమోదు చేసుకోవడానికి: Click here
దరఖాస్తు చేయడానికి: Click here