Inter Practical Exams: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ప్రహసనం.. పట్టించుకోని ప్రభుత్వాలు..

Inter Practical Exams: తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రవేట్ కాలేజీల్లో అసలు ప్రాక్టికల్స్ జరగవనే సంగతి ఎంత మందికి తెలుసు? ఈ విషయం లో కొద్దో గొప్పో స్కూల్స్ నయం. ప్రవేట్ ఇంటర్ కాలేజీ లు ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసే కర్మాగారాలుగా మారిపోయాయా?
Share the news
Inter Practical Exams: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ప్రహసనం.. పట్టించుకోని ప్రభుత్వాలు..

తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రవేట్ కాలేజీల్లో అసలు ప్రాక్టికల్స్ జరగవనే సంగతి ఎంత మందికి తెలుసో కానీ వీటి ప్రహసనం చూస్తే ఎవరైనా ఆశ్చ్యర్య పోవాల్సిందే. MPC, BPC వాళ్లకు మాములుగా అయితే థియరీ సబ్జక్ట్స్ తో పాటు ప్రాక్టికల్స్ కూడా జరగాలి. కానీ ప్రవేట్ కాలేజీల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ అసలు జరగవు, ఏవో కొన్ని కాలేజీలు తప్ప. కానీ వీళ్ళు Day 1 నుంచి JEE Mains లేదా NEET కి తయారు చేయడం మొదలు పెడతారు. సగం పాఠం అవడం మొదలు, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది ఇంటర్ విద్యార్థులకు నరకం. శనివారం ఒక టెస్ట్ & సోమవారం మరొక టెస్ట్ అంటూ రెండు సంవత్సరాలు ఇక స్టూడెంట్స్ కి పబ్లిక్ హాలిడేస్ కూడా వుండవు. అసలు సగం పాఠం అవగానే ఏం టెస్ట్ పెడతారో?

ఇక పోతే థియరీ క్లాస్ లు రెగ్యులర్ గా జరిగినట్లు, ప్రాక్టికల్స్ కూడా జరగాలి. ల్యాబ్ లో ప్రాక్టికల్స్ జరిగినప్పుడు observations రికార్డ్ చేయడం కోసం ఒక రికార్డు పెట్టాలి. ఇక సంవత్సరం చివరిలో రికార్డు సబ్మిట్ చేయాలి. తరువాత రికార్డు కరెక్షన్, ప్రాక్టికల్స్ టెస్ట్. తరువాత వైవా ఉంటుంది. ఇదీ ప్రాసెస్. వీటన్నిటికీ కలపి 30 మార్కులు అన్నమాట.

See also  Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

Inter Practical Exams ప్రహసనం

ప్రవేట్ కాలేజీల్లో అసలు ప్రాక్టికల్స్ జరగనప్పుడు, ఇక ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్(Inter Practical Exams) ఎలా కండక్ట్ చేస్తారు మరియు పైన చెప్పినవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు అనే డౌట్ వచ్చిందా మీకు? ఎలా అంటే సంవత్సరం చివరిలో అంటే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్(Inter Practical Exams) ముందు, రికార్డులను ఎవరో ఒకరి చేత రాపించు కోమంటారు. స్కోరర్ బుక్ నుంచి రిజల్ట్స్ ను కాపీ చేసుకోమంటారు. ఇక రికార్డు కరెక్షన్ చేసేది కాలేజీ వాళ్ళే గాబట్టి నో ప్రాబ్లెమ్.

ఇక ప్రాక్టికల్స్ పరీక్ష మరీ ఘోరం. తలా question ఇస్తారు. దాంతో పాటు స్లిప్ కూడా ఇస్తారు, చూసి రాసుకోవడానికి. ఇక వైవా అంటారా, వచ్చినవాళ్లు ఇద్దరునో ముగ్గురునో ఒకటో రెండు ప్రశ్నలు అడుగి మమ అనిపిస్తారు. తరువాత కాలేజ్ వాళ్ళిచ్చే సమోసా, టీ తాగేసి వాళ్ళిచ్చిన కవర్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ అందరికి 27 నుంచి 30 మార్కులు ఇస్తారు కాబట్టి వాళ్ళు హ్యాపీ, పేరెంట్స్ కూడా.

See also  CM Revanth Reddy Appeals: రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన PM నరేంద్ర మోడీకి CM రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు!

ఇంటర్ చదువులు ఇలా ఉంటే student ఒక మామూలు ఇంజనీరో, డాక్టరో అవుతాడు తప్ప శాస్త్రవేత్త ఎప్పటికి కాలేడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు పుట్టగానే వాళ్ళు ఇంజనీరో లేదా డాక్టరో అనుకుంటారు. అవి కాకుండ ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి అని ఎవరూ ఆలోచించడం లేదు. ఒక విధంగా ఇంటర్ విద్య ఇలా నాశనం కావడానికి ప్రైవేట్ కాలేజీలు పాత్ర ఎంత ఉందొ అంత పాత్ర పేరెంట్స్ కి, పట్టించు కోకుండా వదిలేసిన ప్రభుత్వాలకి కూడా వుంది. తిలా పాపం తలా పిడికెడు.

కొస మెరుపు: Inter Practical Exams ప్రహసనం ఇలా ఉంటే ఇక లాంగ్వాజెస్ (ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం) పరిస్థితి మరీ ఘోరం. సంవత్సరం చివరిలో ఒకవారం మాత్రమే వీటికి కేటాయిస్తారంట!

Also Read News

Scroll to Top