
రానున్న 2024-25 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాల్లో 6 వ తరగతిలో ప్రవేశించదానికి పెట్టే ప్రవేశ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విదులైనాయి. నవోదయ విద్యాలయ సమితి (NVS) వారు, వారి అధికారిక వెబ్‌సైట్ లో డిసెంబర్ 16, 2023న ఫేజ్ 2 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్లను అప్‌లోడ్ చేసింది. Phase 2 JNV ఎంపిక పరీక్ష కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేస్కోవచ్చు
Jawahar Navodaya Vidyalaya Selection Test 2024 Phase II
Jawahar Navodaya Vidyalaya Selection Test 2024 Phase II, 6వ తరగతిలో అడ్మిషన్ కోసం ఆసక్తిగల విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి జనవరి 20, 2024న నిర్వహించబడుతుంది. 6వ తరగతికి సంబంధించిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాలలో 2 గంటల పాటు పెన్ -పేపర్ మోడ్‌లో ఆఫ్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. విద్యార్థులు హిందీ లేదా ఇంగ్లీషు భాషల్లో ప్రశ్నలకు సమాధానమిచ్చే అవకాశం కలిగి ఉంటారు. JNV అడ్మిట్ కార్డ్ అనేది ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి విద్యార్థులు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన పత్రం, ఎందుకంటే వారు అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి అనుమతించబడరు.
నవోదయ అడ్మిట్ కార్డ్ 2024ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి Click here
