JEE Mains 2024: సరైన ఫోటో upload చేయని విద్యార్థులకు మరో అవకాశం

JEE Mains 2024 కోసం కొంతమంది అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ NTA రూల్స్ ప్రకారం లేనట్లు గమనించబడింది. దీనితో సరైన ఫోటో upload చేయని విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చిన NTA .
Share the news
JEE Mains 2024:  సరైన ఫోటో upload చేయని విద్యార్థులకు మరో అవకాశం

JEE Mains 2024 కోసం కొంతమంది అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ NTA రూల్స్ ప్రకారం లేనట్లు గమనించబడింది. కాబట్టి NTA, అభ్యర్థులకు అవసరమైన స్పెసిఫికేషన్ల ప్రకారం ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయడానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.

సరైన ఫోటో upload చేయడానికి timeline 04.01.2024 నుంచి 06.01.2024 (11:50PM) ఇవ్వబడింది. సరైన ఫోటోగ్రాఫ్ లేని అప్లికేషన్స్ తిరస్కరించబడును. కావున అభ్యర్థులు JEE Mains 2024 అఫీషయల్ వెబ్ సైట్ https://jeemain.ntaonline.in/ కు వెళ్లి సరైన ఫోటో upload చేయగలరు.

JEE Mains 2024: అభ్యర్థి ఫోటోగ్రాఫ్ కోసం స్పెసిఫికేషన్లు

పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ (సైజ్ : 10 kb నుండి 200 kb) (ఇటీవలి ఫోటోగ్రాఫ్ ఏదైనా అయి ఉండాలి. రంగులో లేదా నలుపు & తెలుపులో 80% ముఖంతో (ముసుగు లేకుండా) చెవులతో సహా కనిలించాలి. ఫోటోగ్రాఫ్ Background తెలుపు ఉండాలి )
కళ్లద్దాలు క్రమం తప్పకుండా వాడితేనే అనుమతించబడతాయి.
పోలరాయిడ్ మరియు కంప్యూటర్-సృష్టించిన ఫోటోలు ఆమోదయోగ్యం కాదు.
ఈ సూచనలను పాటించని లేదా అస్పష్టమైన ఫోటోగ్రాఫ్ లతో ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడుతాయి.
ఫోటోగ్రాఫ్ లేని దరఖాస్తులు కూడా తిరస్కరించబడుతాయి.
ఫోటోగ్రాఫ్ లు ధృవీకరించబడనవసరం లేదు. అభ్యర్థులు 6 నుంచి 8 పాస్‌పోర్ట్‌లు ఉంచుకోవాలని సూచించారు.

See also  JEE Mains 2024 Score Card released: JEE మెయిన్స్ 2024 స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన NTA!

Also Read News

Scroll to Top