APPSC and SBI: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. గ్రూప్-2 రాసే వారికి మరో రోజు SBI పరీక్ష పెట్టిస్తాం అంటున్న APPSC

Share the news
APPSC and SBI: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. గ్రూప్-2 రాసే వారికి మరో రోజు SBI పరీక్ష పెట్టిస్తాం అంటున్న APPSC

ఒకేరోజు APPSC and SBI పరీక్షలు

APPSC and SBI Exams: ఒకవైపు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష, మరోవైపు SBI Junior Associate మెయిన్స్ పరీక్ష.. ఒకేరోజు ఈ రెండు పరీక్షలు వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రూప్-2 పరీక్ష తేదీని నిర్ణయించడంపై APPSC తీరును ఉద్యోగార్థులు నిరసిస్తున్నారు. ఉద్యోగ నియామకాల పరీక్ష తేదీల ఖరారు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే ఇతర పరీక్షలు, వాటి తేదీలను పరిగణనలోకి తీసుకోకుండా APPSC పరీక్షల తేదీలను ప్రకటించడం విడ్డూరంగా ఉంది.

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా Junior Associate పోస్టుల భర్తీకి గత నవంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లోనే ఫిబ్రవరి 25న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక రాష్ట్రంలో గ్రూపు-2 నోటిఫికేషన్ గత డిసెంబరు 7న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అంతకుముందే ప్రకటించిన SBI షెడ్యూల్ చూసుకోకుండా APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ ను అదే తేదీ లో పెట్టింది. ఒకేరోజు APPSC and SBI పరీక్షలు ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

See also  Most Popular CMs: పాన్ ఇండియాలో యోగి టాప్.. సొంత రాష్టాల్లో నవీన్.. మన సీఎం ఏ స్థానంలో?

ఎస్‌బీఐ హాల్‌టికెట్లు పంపితే వాళ్లకి SBI ఎగ్జామ్ తేదీని మార్పిస్తాం అంటున్న APPSC
ఎస్‌బీఐ Junior Associate మెయిన్స్ పరీక్ష దరఖాస్తు చేసిన వారు హాల్‌టికెట్లను తమకు పంపించాలని ఏపీపీఎస్సీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. “పరీక్ష విషయంలో ఎస్‌బీఐ ఉన్నతాధికారులను సంప్రదించాం. మాకు అందిన 10 మంది అభ్యర్థుల హాల్‌టికెట్లు వారికి పంపగా.. వారు మార్చి 4న (మరో స్లాట్) పరీక్ష నిర్వహించేందుకు ఆమోదించారు. ఇంకా ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 19లోగా తెలియజేయాలి. ఆ వివరాలను వారికి పంపి పరీక్ష తేదీల మార్పునకు కృషి చేస్తామని APPSC కార్యదర్శి శనివారం(ఫిబ్రవరి 17న) ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులు విజ్ఞప్తులు పంపాల్సిన ఈమెయిల్: appschelpdesk@gmail.com

ఈ సందర్బంగా APPSC విడుదల చేసిన వెబ్ నోట్: Click Here

మరిన్ని ఉద్యోగ వివరాల కొరకు: https://searchjob.in/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top