
OU Distance Education
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించబడ్డాయి. వేదిక్ ఆస్ట్రాలజీ కోర్సుకు సంబంధిత విభాగంలో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు టీఎస్‌ఐసెట్/ఏపీ ఐసెట్ అర్హత తప్పనిసరి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఫేజ్-II ప్రవేశాలకు చివరితేది: 31.03.2024.