RRB Assistant Loco Pilot: ITI మరియు డిప్లొమా అభ్యర్థులకు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టులు

Share the news
RRB Assistant Loco Pilot: ITI మరియు డిప్లొమా అభ్యర్థులకు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టులు

RRB Assistant Loco Pilot Recruitment

RRB అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot) రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ దేశంలోని అన్ని రైల్వే రీజియన్‌లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,696 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ జోన్‌లో 758 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 199, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 559 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 19, 2024 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆమోదించబడతాయి.

పూర్తి వివరాలకై చూడండి https://searchjob.in/ లోని నోటిఫికేషన్ : Click Here for Notification

మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900- రూ.63,200 వేతనం చెల్లిస్తారు.

See also  AP TET 2024: AP ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల, 8th Feb. నుండి దరఖాస్తులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top