
SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024:
SAINIK SCHOOLS exam Hall tickets: దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి ‘అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE) 2024 హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉన్నాయ్. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు జరుగుతాయి.
షెడ్యూలు ప్రకారమే జనవరి 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోతరగతి విద్యార్థులకు జనవరి 28 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దారుడ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..