
తెలంగాణ ఇంటర్ హాల్ టిక్కెట్లు 2024(TS Inter Hall Tickets 2024)
తెలంగాణలో(Telangana) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు SSC లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇక ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక పోతే ఈ విద్యా సంవత్సరానికి 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారని తెలుస్తోంది
Note: వెబ్సైటు లో డౌన్లోడ్ లింక్ ఇంకా పెట్టలేదు.. లింక్ పెట్ట గానే ఇక్కడ అప్డేట్ చేయబడును. పాఠకులు గమనించ గలరు..
ఇంటర్ Time Table:
