
TSPSC Exam Results
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు శుక్రవారం (ఫిబ్రవరి 16) రాత్రి సాధారణ ర్యాంక్ మెరిట్ జాబితా (జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. వీటిలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్(Town Planning Overseer), డ్రగ్ ఇన్స్పెక్టర్(Drug Inspector), హార్టికల్చర్ ఆఫీసర్(Horticulture Officer), లైబ్రేరియన్లు(Librarian), ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్(Agriculture Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 2022లో ఇవ్వబడింది మరియు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను 2023 మే, జూన్ మరియు జూలై నెలల్లో నిర్వహించింది. TSPSC ఈ పరీక్షల సాధారణ ర్యాంక్ జాబితాలను తాజాగా విడుదల చేసింది. ధ్రువీకరణ పత్రాల కోసం 1:2 నిష్పత్తిలో జాబితాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
TSPSC Exam Results: డైరెక్ట్ లింకులు క్రింద ఇవ్వబడ్డాయి
Town Planning Building Overseer – General Ranking List
Drugs Inspector – General Ranking List
Horticulture Officer – General Ranking List
Agriculture Officer General – Ranking List